AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter: ఉత్తర భారతంలో కనిష్టానికంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. అక్కడ కార్లపై పడుతున్న మంచుగడ్డలు..

శీతాకాలం ఉత్తరభారతదేశంలో చలి ఎక్కువుగా ఉంటుందనే విషయం తెలుసు. అయితే కొన్ని ప్రాంతాలు మినహిస్తే మిగిలిన చోట్ల చలికి మంచు గడ్డలు కట్టడం తక్కువుగా చూస్తుంటాం. సాధారణంగా అమెరికా, కెనాడాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలికాలం బయటకు..

Amarnadh Daneti
|

Updated on: Dec 03, 2022 | 12:30 PM

Share
శీతాకాలం ఉత్తరభారతదేశంలో చలి ఎక్కువుగా ఉంటుందనే విషయం తెలుసు. అయితే కొన్ని ప్రాంతాలు మినహిస్తే మిగిలిన చోట్ల చలికి మంచు గడ్డలు కట్టడం తక్కువుగా చూస్తుంటాం. సాధారణంగా అమెరికా, కెనాడాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలికాలం బయటకు వచ్చేటప్పుడు తమ కార్లో ఉప్పు ప్యాకెట్లు పెట్టుకుని వస్తారు. ఎందుకంటే శీతాకాలం అక్కడ ఉదయం సమయంలోనూ మంచు కురుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మంచుగడ్డలు కార్లపై పడతాయి. ఆ సమయంలో మంచు కరిగిపోవడానికి ఉప్పు ప్యాకెట్లను ఉపయోగిస్తారు. ఇలాంటి ఘటన ఇప్పుడు రాజస్థాన్‌లో కనిపిస్తోంది.

1 / 5

ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోడుతున్నాయి. రాజస్థానాలోని చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పర్యాటక ప్రాంతం  మౌంట్ అబూలో ప్రస్తుత సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ, నొయిడా, హర్యానాలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి.

2 / 5
ఈ సీజన్‌లో తొలిసారి రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మౌంట్ అబూ హిల్ స్టేషన్‌లోని కార్లు, పొలాలను మంచు దుప్పటి కప్పేసింది.  రాజస్థాన్‌లోని 32 నగరాల్లో మౌంట్ అబైలో అత్యంత చలి తీవ్రత ఉన్న నగరంగా నిలిచింది. కొంతమంది చేతులపై కూడా మంచుగడ్డలు కనిపించిన పరిస్థితి అక్కడ నెలకొంది.

3 / 5
పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువుగా ఉండటంతో రూములకే పరిమితమై.. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్న తర్వాత బయటకు వస్తున్నారు. మౌంట్ అబూ వద్దకు చేరుకున్న కొంతమంది పర్యాటకులు అయితే చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హిల్ స్టేషన్‌లో  అందాలను వీక్షిస్తున్నారు.

4 / 5
చలికాలం కావడంతో రాజస్థాన్‌లో దాదాపు 12కు పైగా జిల్లాలను పొగమంచు కమ్మేసింది. మౌంట్ అబూతో సహా పలు  జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికంటే తక్కువుగా నమోదవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఇక్కడ ఉష్ణోగ్రత ఒకటి నుంచి సున్నా డిగ్రీల మధ్య నమోదవుతుంది. హిల్ స్టేషన్‌ మౌంట్ అబూలో కార్లు, పొలాల్లో మంచు గడ్డలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో చాలా మంది ప్రజలు చలి మంటలు కాసుకుని చలి తీవ్రత నుంచి రక్షణ పొందుతున్నారు.

5 / 5