- Telugu News Photo Gallery Cinema photos Know Why Sai Pallavi Wont wear Short Dress In Movies and Events, This Is the Reason
Sai Pallavi: సాయి పల్లవి పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి రీజన్ ఇదే..
ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుసగా హిట్ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ఇప్పుడు రామాయణం సినిమాలో నటిస్తుంది.
Updated on: Apr 03, 2025 | 12:04 PM

ఇటీవలే తండేల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది సాయి పల్లవి.

ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుండగా.. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరిలో సాయి పల్లవి ప్రత్యేకం. కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులను అలరిస్తుంది. అద్భుతమైన నటనతో ఫాలోయింగ్ పెంచుకుంది.

అయితే సాయి పల్లవి సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించకపోవడానికి ప్రత్యేక కారణముంది. గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యిందని... అందులో తాను పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయని తెలిపింది.

ప్రేమమ్ సినిమా తర్వాత ఆ వీడియోను షేర్ చేస్తూ తన ప్రదర్శన చూడకుండా తనపై విమర్శలు చేశారని.. అందుకే ఇకపై పొట్టి దుస్తులు, అసౌకర్యంగా ఉండే దుస్తులు ధరించకూడదని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది.





























