నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రోటీన్, ఫైబర్, రాగి, కాల్షియం, ఫాస్పరస్, క్యాలరీలు, మాంగనీస్, ఇతర విటమిన్లు, ఇంకా కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
నువ్వుల్లో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. తెల్ల రక్త కణాలను చురుకుగా ఉంచడానికి ప్రోత్సహిస్తాయి. ఎముకలు బలంగా ఉంటాయి.
నువ్వులను తినడం వల్ల మీ ఎముకలు గట్టిపడతాయి. దీంతో మీకు బోలు ఎముకల వ్యాధి రాదు. నువ్వుల్లో కొవ్వు, ఒమేగా 6 ఉండటం వల్ల శరీరంలో వాపు, నొప్పిని తగ్గిస్తాయి.
నువ్వుల్లో పైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధాకాన్ని నివారించడంతోపాటు మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటుంది.
నువ్వులు చర్మాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. నువ్వులు తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు.
నల్ల నువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు,యు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు పోషణ లభిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
నువ్వులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నల్ల నువ్వులను తినడం వల్ల మీ ఒత్తిడి దూరమవుతుంది.