గాజులు అందం కోసమా ..? ఆరోగ్యం కోసమా..? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే..
కంకణాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు: హిందూ మతం ప్రకారం స్త్రీలకు గాజులు ధరించడం ఒక సంప్రదాయం. పురాతన కాలం నుండి, మహిళలు రాగి, వెండి, బంగారం, ప్లాస్టిక్, గాజు వంటి వివిధ లోహాలతో చేసిన కంకణాలను ధరించే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అయితే, ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా?
Updated on: Dec 27, 2023 | 7:33 PM

బ్యాంగిల్స్ కేవలం అందానికి సంబంధించిన వస్తువు మాత్రమే కాదు . ఇది మన వారసత్వం, సంస్కృతిలో కూడా భాగం. వీటిని ధరించడం ద్వారా మహిళలు అందంగా కనిపించడమే కాకుండా అపారమైన ప్రయోజనాలను పొందుతారు. చేతికి ధరించే గాజుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రక్త ప్రసరణ: ఆడవారు చేతులకు గాజులు ధరించడం వల్ల మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురై రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఇది వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.

గర్భిణీ స్త్రీలకు ఉత్తమం: గర్భిణీ స్త్రీలు రెండు చేతులకు బ్యాంగిల్స్ ధరించాలి. ముఖ్యంగా సీమంత శాస్త్ర సమయంలో ఎక్కువ గాజులు ధరించాలని చెబుతారు. దీనికి ప్రధాన కారణం కంకణాల శబ్ధం కడుపులోని బిడ్డకు ఊరటనిస్తుంది. అంతే కాకుండా, దీని ప్రధాన నేపథ్యం ఏమిటంటే ఇది శిశువులలో వినికిడిని మెరుగుపరుస్తుంది. గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత సమస్య తొలగిపోతుంది. గాజుల శబ్దం.. తల్లి, కడుపులో ఉన్న బిడ్డకు ఒత్తిడి లేకుండా చేస్తుంది.

ప్రయోజనాలు : ముందుకు వెనక్కి గాజులు కదలటం వల్ల రక్త నాళాలకు మసాజ్ అవుతూ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు నొప్పులను భరించే శక్తి లభిస్తుంది. శరీరంలో వేడిని తొలగించటంలో మట్టి గాజులు ఉపకరిస్తాయి.

గాస్ల్ బ్యాంగిల్స్ వాతావరణం నుండి మంచితనం, స్వచ్ఛతను గ్రహిస్తాయి. ఇది ధరించేవారికి సహజ వాతావరణంలో ఉండటానికి శక్తిని ఇస్తుంది. చుట్టుపక్కల వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

గ్లాస్ బ్యాంగిల్స్ కోసం రెండు రంగులు ఎంతో ప్రముఖ్యత కలిగి ఉన్నాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ. కర్నాటక, మహారాష్ట్ర వంటి దక్షిణ భారత రాష్ట్రాలలో ఆకుపచ్చని గాజులను సాధారణంగా ధరిస్తారు. పంజాబ్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో రెడ్ కలర్ ఎక్కువగా వాడుతున్నారు. ఆకుపచ్చ సాధారణంగా ఆధ్యాత్మికత, శాంతిని సూచిస్తుంది.

చెడును నాశనం చేసే శక్తి ఎరుపు రంగుకు ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, గ్లాస్ బ్యాంగిల్స్ ధరించే మహిళలు ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు. వారు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు.





























