Yoga Day 2023: శ్వాస పై ధ్యాస.. సూర్య నమస్కారాలలో మొత్తం 12 ఆసనాలు ఇలా చేయండి..
సూర్య నమస్కారాలు నిత్యం చేయవచ్చు. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం ఆరోగ్యంగా మారుతుంది. నడుము సన్నగా, నాజుగ్గా మారుతుంది. ఛాతీ భాగా విచ్చుకుంటుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 12 భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానంతో కలిసిన వ్యాయామం ఇందులో ఉన్నాయి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను అంటే డిటాక్స్ సహజంగా బయటకు వెళ్లిపోతాయి.