AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boost Immunity Naturally: చలికాలంలో మీ రోగ నిరోదక శక్తిని పెంచే.. సూపర్‌ డ్రింక్స్‌.. రోజూ తాగితే..

చలికాలం వచ్చిందంటే చాలా దగ్గు, జలుబు, కాలానుగుణ ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. వీటి వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటురు. ఎందుకంటే శీతాకాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా మనం త్వరగా వ్యాధుల భారీన పడుతాం. అయితే మన వంటింట్లో లభించే కొన్ని సాంప్రదాయ మూలికా మిశ్రమాల ద్వారా రోగనిరోధక పెంచుకోవడమే కాకుండా ఇలాంటి సీజనల్ వ్యాధుల భారీ నుంచి తప్పించుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Nov 17, 2025 | 4:14 PM

Share
 తులసి-అల్లం నీరు: ఇది రోగనిరోధక శక్తిని పెంచే ఒక క్లాసిక్ పానీయం, ఇందలో వాడే తులసి ఆకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ శక్తి, అల్లంలో ఉండే శోథ మీరో నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతాయి. దీని వల్ల మీరు వ్యాధుల భారీ నుంచి తప్పించుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో కోసం 5–6 తులసి ఆకులు, 1 అంగుళం తురిమిన అల్లం, చిటికెడు నల్ల మిరియాలు తీసుకొని వాటిని వాటని రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించడం. తర్వాత వాటిని వడకట్టి గోరువెచ్చగా త్రాగాలి. ఈ కషాయం గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది అలాగే సహజంగా ముక్కు దిబ్బడను తొలగిస్తుంది.

1 / 5
పసుపు-నల్ల మిరియాలు నీరు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు కలిగి ఉంటుంది.  దీన్ని నల్ల మిరియాలతో కలిపినప్పుడు, దాని శోషణ గణనీయంగా మెరుగుపడుతుంది. దీన్ని తాగడం వల్ల రోగనిరోదక శక్తితో పాటు శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు కప్పుల నీటిలో ½ టీస్పూన్ పసుపు పొడి, 2 దంచిన మిరియాల గింజలు, చిన్న దాల్చిన చెక్క ను నీటిలో వేసి . 10 నిమిషాలు మరిగించి, వడకట్టి తాగండి.

2 / 5
దాల్చిన చెక్క-లవంగం నీరు: దాల్చిన చెక్క,లవంగాలతో చేసిన పానియం శీతాకాలంలో శరీరానికి వేడినియ్యడంతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది, జలుబు లక్షణాలను తగ్గిస్తుంది, జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది. దీన్ని తయారు చేసేందుకు ముందుగా కొన్ని వాటర్ తీసుకొని వాటిని వేడి చేయండి . తర్వాత ఆ వేడి నీటిలో 1 చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ,1 టీస్పూన్ తేనె కలపండి. 10 నిమిషాలు తర్వాత దాన్ని కప్‌లోకి తీసుకొని తాగండి

3 / 5
ఆమ్లా-అల్లం నీరు : అమ్లా-అల్లం నీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది తయారు చేసేందుకు  2 కప్పుల నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఉసిరి రసం,కొద్దిగా తురిమిన అల్లం, చిటికెడు పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పాటు మరిగించి..  గోరువెచ్చగా అయ్యాకా.. కప్‌లోకి సర్వ్ చేసుకొని తాగండి. ఇది మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

4 / 5
తులసి-ములేతి నీరు: ఈ నీరు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఈ నీటిని రోజుకూ రెండు సార్లు తాగితే ఎలాంటి జబ్బులు మీ దరి చేరవు. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ.. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా 1 టీస్పూన్ ములేథి పొడి, 4–5 తులసి ఆకులు, చిటికెడు నల్ల మిరియాలు నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత వడకట్టి గోరువెచ్చగా అయ్యాక తాగండి.

5 / 5
Follow Us