AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Vs Jowar: గోధుమ లేదా జొన్న.. ఆరోగ్యానికి ఏ రొట్టె మంచిదో తెలుసా..?

దేశంలో చాలామంది రోటీ ఎక్కువగా తింటారు. కొంతమంది గోధుమలతో చేసిన రోటీని ఇష్టపడితే, మరికొందరు జొన్న లేదా ఇతర మిల్లెట్ రోటీలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు ధాన్యాలు వాటి స్వంత పోషక విలువలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటిలో ఏది ఉత్తమమో తెలుసుకోవడం అవసరం. గోధుమ - జొన్న మధ్య ఉన్న తేడాలు..? ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 19, 2025 | 8:33 PM

Share
గోధుమ పిండితో పోలిస్తే జొన్న పిండి రొట్టె చాలా ప్రయోజనకరం. దీనికి ప్రధాన కారణం జొన్న గ్లూటెన్ రహితం కావడం. జొన్నలో గ్లూకోజ్ ఉండదు.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది మన శరీరంలోని కాలేయం, మూత్రపిండాల వంటి అవయవాలకు చాలా మంచిది. జొన్న చల్లదనాన్ని కలిగి ఉన్నందున, ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

1 / 5

గోధుమ పిండి కూడా జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ అందులో ఉండే గ్లూటెన్ కొంతమందికి జీర్ణం కావడానికి కష్టం కావచ్చు. అందువల్ల, రెండింటినీ పోల్చి చూసినప్పుడు, ఆరోగ్య ప్రయోజనాల పరంగా జొన్న రొట్టె మెరుగైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
గోధుమ రొట్టెకి బదులుగా జొన్న రొట్టెని తినడం ఒక మంచి పద్ధతి. అంతేకాకుండా జొన్నలను నానబెట్టి, ఉప్మా లేదా పులావ్‌లాగా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. జొన్నలను  పొడి చేసి, పాలతో లేదా నీళ్లతో కలిపి రుచికరమైన గంజి తయారు చేసుకోవచ్చు. అదనంగా జొన్నలతో చేసిన చీలా, ఇడ్లీ, ధోక్లా, కిచిడీలు కూడా ఆరోగ్యకరమైనవి.

3 / 5
100 గ్రాముల గోధుమ పిండిలో 340 కేలరీలు, 13.2 గ్రాముల ప్రోటీన్, 72 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10.7 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇందులో సెలీనియం, మాంగనీస్, పాస్పరస్, రాగి, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ అధిక మొత్తంలో గ్లూటెన్ కూడా ఉంటుంది.

4 / 5
మరోవైపు అర కప్పు జొన్నలో329 కేలరీలు, 11 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 72 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 7 గ్రాముల ఫైబర్ ఉంటాయి. జొన్నల్లో విటమిన్ బి1, విటమిన్ బి6, రాగి, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది గ్లూటెన్ రహితం. మొత్తంగా గోధుమతో పోలిస్తే జొన్నలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని.. ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి జొన్న రొట్టె మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..

బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...