- Telugu News Photo Gallery Is the paneer you buy good? Identify fake paneer like this, Check Here is Details
Fake Paneer: మీరు కొనే పన్నీర్ మంచిదేనా? కల్తీ పన్నీర్‌ని ఇలా గుర్తించండి..
పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం. పన్నీర్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. పన్నీర్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శాకాహారులు, నాన్ వెజ్ లవర్స్ కూడా ఎక్కువగా పన్నీరే తింటారు. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే పన్నీర్ కూడా కల్తీ మయం అవుతుంది. నకిలీ పన్నీర్‌ని ఈ చిట్కాలతో గుర్తించవచ్చు..
Updated on: Jan 27, 2025 | 1:45 PM

ఈ మధ్య కాలంలో బయట ఏది కొని తినాలన్నా జనాలు భయపడి పోతున్నారు. జాబ్స్ చేస్తూ సమయం లేని వారు భయపడుతూనే తింటున్నారు. పాల దగ్గర నుంచి అన్నీ కల్తీనే. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఆహారాన్ని అమ్మేస్తున్నారు.

శాఖాహారులు ఎక్కువగా తీసుకునే వాటిల్లో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్‌ని కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు. కల్తీ పన్నీర్ తినడం వల్ల అనేక మంది అస్వస్థతకు గురవుతున్నారు. నకినీ పన్నీర్‌ని వెజిటేబుల్ ఆయిల్, పిండి, రసాయనాలు కలిపి తయారు చేస్తారు.

నకిలీ పన్నీర్‌ని కొన్ని రకాల చిట్కాలతో గుర్తించవచ్చు. పన్నీర్‌ని రెండు చేతుల మధ్య పెట్టి నలిపి చూడండి. ఇది సులభంగా పిండిలా అయిపోతే మాత్రం ఇది కల్తీ పన్నీర్ అని అర్థం. పన్నీర్ విరగకుండా గట్టిగా ఉంటే.. అసలైనదని చెప్పొచ్చు.

మరో చిట్కా ఏంటంటే.. పన్నీర్‌ను నీళ్లలో వేసి ఓ పది నిమిషాలు మరిగించాలి. ఇది చల్లారాక కందిపప్పు పొడి చేసి కాస్త కలపాలి. కాసేపటికి ఇది లేత ఎరుపు రంగులోకి మారితే అది యూరియా, డిటర్జెంట్‌తో చేసిన పన్నీర్ అని చెప్పొచ్చు.

పన్నీర్‌ని మనం ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాలను చిక్కగా మరిగించాలి. వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కలిపి పక్కన పెట్టాలి. పాలు విరిగిపోతాయి.. దీన్ని మెత్తని క్లాత్‌లో వేసి ఓ గంట పక్కన పెడితే పన్నీర్ సిద్ధం. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




