- Telugu News Photo Gallery Is Refrigerator Cold Water Drinking Increase Heart Rate? Know Risks and Benefits
Cold Water Side Effects: వేసవిలో ఫ్రిజ్ నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త హార్ట్ ఎటాక్ మీకూ రావచ్చు..
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి నీటికి మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే రిఫ్రిజిరేటర్‌లోని చల్లని నీళ్లు తాగడం మనలో చాలా మందికి అలవాటే. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ ..
Updated on: May 02, 2024 | 8:32 PM

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి నీటికి మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే రిఫ్రిజిరేటర్‌లోని చల్లని నీళ్లు తాగడం మనలో చాలా మందికి అలవాటే. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, టాన్సిలిటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఇది మొదట జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం సమస్య వస్తుంది.

నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను వాగస్ నాడి నియంత్రిస్తుంది. చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా శరీరం వివిధ రకాల ఫ్లూలకు శరీరం లభంగా ప్రభావితమవుతుంది. దీంతో వివిధ శారీరక సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఫలితంగా కొవ్వును కరిగించడం సాధ్యం కాదు. ఇది పరోక్షంగా బరువు పెరుగుటకు దారితీస్తుంది.




