AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిండి పులియబెట్టే పనిలేకుండా 10 నిమిషాల్లో నోరూరించే ‘టమాటో స్టీమ్ దోశ’.. నోట్లో వేస్తే కరిగిపోతుంది!

ఉదయం లేవగానే పిల్లల స్కూలుకు, ఆఫీసులకు టిఫిన్ ఏం చేయాలో పాలుపోనప్పుడు చాలామందికి ఇడ్లీ, దోశ పిండి లేకపోతే సతమతమవుతుంటారు. అలాంటి సందర్భాల్లో పిండి రుబ్బి పులియబెట్టే శ్రమ లేకుండా కేవలం పది నిమిషాల్లో అప్పటికప్పుడు తయారుచేసుకోగలిగే అద్భుతమైన వంటకమే 'టమాటో స్టీమ్ దోశ'.

Phani CH
|

Updated on: Aug 29, 2026 | 5:46 PM

Share
ఎర్రటి పుల్లని టమాటాలు, బొంబాయి రవ్వ, తాజా కొబ్బరి మరియు సుగంధ మసాలాల కలయికతో ఆవిరిపై ఉడికే ఈ దోశలు దూదిలా ఎంతో మృదువుగా, స్పాంజిలా రంధ్రాలతో నోట్లో వేస్తే కరిగిపోతాయి. స్పైసీ గ్రేవీలు లేదా కొబ్బరి పచ్చడితో అద్భుతంగా సరిపోయే ఈ ఇన్స్‌టంట్ దోశ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు:  3 - ముక్కలుగా కోసినవి ఎర్రటి పుల్లని నాటు టమాటాలు, అర కప్పు పుల్లటి పెరుగు, 2 కప్పుల బొంబాయి రవ్వ / ఉప్మా రవ్వ, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 నుండి 5 కాశ్మీరీ ఎండుమిర్చి, 4 నుండి 5 - కారానికి తగినట్లు గుంటూరు ఎండుమిర్చి, ఒకటిన్నర అంగుళం అల్లం ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా పిండి, పావు టీస్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు మరియు తగినంత నూనె.

2 / 5
పిండి తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్‌లో కట్ చేసిన టమాటా ముక్కలు, అర కప్పు పుల్లటి పెరుగు మరియు రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసి, అవసరమైనన్ని నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.అదే మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, బ్యాడిగి మిర్చి, గుంటూరు ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, మైదా పిండి మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ మెత్తగా అవ్వడానికి ముందుగా రుబ్బుకున్న రవ్వ పిండిని కొద్దిగా కలిపి మళ్లీ మిక్సీ పట్టాలి.

3 / 5
ఇప్పుడు ఈ కొబ్బరి-మిర్చి మిశ్రమాన్ని మిగిలిన రవ్వ-టమాటా పిండిలో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ పిండిని కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.దోశలు వేయడానికి ముందు పిండిలో పావు టీస్పూన్ వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోసి దోశ పిండి జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.

4 / 5
స్టీమ్ దోశ వేసే పద్ధతి: స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. వేడెక్కిన పెనంపై ఒకటిన్నర గరిటెల పిండిని పోసి, నెమ్మదిగా మధ్యలో మాత్రమే కొద్దిగా స్ప్రెడ్ చేయాలి పల్చగా రుద్దకూడదు. అంచుల వెంట, మధ్యలో కొద్దిగా నూనె చల్లాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఆవిరి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టి ఉడికించాలి. ఆవిరికే దోశ పైభాగం చక్కగా ఉడికి, రంధ్రాలతో ఎంతో సాఫ్ట్‌గా పొంగుతుంది. ఈ దోశను రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. అంతే, ఎంతో రుచికరమైన టమాటో స్టీమ్ దోశ సిద్ధం! వేడివేడిగా ఏదైనా రోటి పచ్చడి లేదా స్పైసీ చికెన్, మటన్ గ్రేవీతో తింటే అమృతంలా ఉంటుంది!

5 / 5
Follow Us