జామ పండు లేదా కాయా? ఏది తినడం ఆరోగ్యానికి మంచిది!

Samatha

29 August 2026

జామ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ జామకాయ తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.

అయితే కొంత మంది జామ పండును ఎక్కువగా తింటే, మరికొంత మంది జామకాయను ఎక్కువగా తింటుంటారు. మరి కొందరూ రెండూ తినడానికి ఇష్టపడతారు.

ఇంకొంత మంది అసలు ఏ జామకాయ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆలోచిస్తారు. కాగా, ఇప్పుడు ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేది ఏదో చూద్దాం.

నిపుణుల ప్రకారం, జామ కాయ, ముఖ్యంగా కాస్త గట్టిగా ఉండేది తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిని తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట.

జామకాయలో ఫైబర్, విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేసి అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా మంచిది. అంతే కాకుండా షుగర్ పేషెంట్స్ పచ్చి జామ కాయ ప్రతి రోజూ తినడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది.

అంతే కాకుండా ప్రతి రోజూ ఒక జామ కాయ తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక పండిన జామ పండు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

పండు జామ పండు తినడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు కాయ తినడమే ఆరోగ్యానికి మేలు.