AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రోజూ గుప్పెడు పుట్నాల పప్పు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?

శనగల్ని వేయించి పుట్నాలపప్పు తయారు చేస్తారు. ఇందులో పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వాస్తవానికి శనగలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. పుట్నాల పప్పు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. ఏయే లాభాలుంటాయో తెలుసుకోండి.

Jyothi Gadda
|

Updated on: Mar 15, 2025 | 8:41 AM

Share
పుట్నాలపప్పులో పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, చాలా సేపటి వరకు కడుపు నిండిన భావనతో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. పుట్నాల పప్పు తినటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం దగ్గర్నుంచి అనేక సమస్యల్ని దూరం చేస్తాయి.

1 / 5
పుట్నాలపప్పులో పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా పాస్ఫరస్ తీసుకుంటే మీ బాడీలో రక్తపోటు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. బాడీలో జరిగే జీవ ప్రక్రియలలో పాస్ఫరస్  కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
ఈ పుట్నాల పప్పులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ ఆక్సీకరణ కారకంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల DNA నష్టం తగ్గుతుంది. ఇమ్యూనిటీ బలంగా మారేందుకు సెలీనియం పాత్ర కూడా కీలకమైనదే. అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

3 / 5
పుట్నాలపప్పు షుగర్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఇది గ్లూకోజ్ హెచ్చుతగ్గుల్ని సరిచేస్తుంది. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా తగ్గకుండా చూస్తుంది. ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకునేలా చేస్తుంది. పుట్నాలపప్పులో ఉండే పోషకాలు గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచేందుకు హెల్ప్ చేస్తుంది.

4 / 5
పుట్నాల పప్పులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఉబ్బరం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. ప్రేగు కదలికలు ఈజీగా మారతాయి. రెగ్యులర్‌గా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పుట్నాలపప్పుని తింటే చాలా వరకూ సమస్య తగ్గుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.

5 / 5