AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon: నిమ్మకాయలు 6 నెలలు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి.. చిన్న పనితో ఫ్రెష్‌గా..

మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే వాటిలో నిమ్మకాయ ఒకటి. ఇది ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇంకా మన ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. ఉదయం వేడి నీటిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. వంటలో, రసాలు, ఊరగాయలు చేయడంలో నిమ్మకాయ తప్పనిసరి.

Krishna S
|

Updated on: Sep 04, 2025 | 7:54 PM

Share
నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే తొక్క గట్టిపడి, ఎండిపోయి, రసం తగ్గిపోతుంది. అవి పాడైపోతాయి. దీనివల్ల మళ్ళీ మళ్ళీ మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఒకేసారి ఎక్కువగా నిమ్మకాయలు కొని ఫ్రిజ్‌లో పెట్టినా, అవి త్వరగా పాడైపోతాయి.

1 / 5
అద్భుతమైన చిట్కా: ఈ సమస్యకు ఒక అద్భుతమైన, సులభమైన పరిష్కారం ఉంది. మనం రోజూ ఉపయోగించే ఆయిల్ ప్యాకెట్లు ఖాళీ అయిన తర్వాత వాటిని పారేస్తాం. అయితే ఆ ఖాళీ ప్యాకెట్లను ఉపయోగించి నిమ్మకాయలను సుమారు 6 నెలల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.

2 / 5
ముందుగా తాజా తెచ్చిన నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత తడి లేని నిమ్మకాయలను ఖాళీ ఆయిల్ ప్యాకెట్‌లో వేసి, పై భాగాన్ని గట్టిగా మూసేయాలి. ఈ ప్యాకెట్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.

3 / 5
ఎలా పనిచేస్తుంది?: ఆయిల్ ప్యాకెట్‌లో మిగిలి ఉండే నూనె నిమ్మకాయల పైన ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇది నిమ్మకాయలకు గాలి తగలకుండా చేస్తుంది. గాలి లోపలికి వెళ్లకపోవడంతో, నిమ్మకాయలు ఎండిపోకుండా, రసాన్ని కోల్పోకుండా ఉంటాయి. తేమ కూడా అలాగే ఉంటుంది. దీని వల్ల నిమ్మకాయలు 6 నెలల వరకు తాజాగా ఉంటాయి. ఇది ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

4 / 5
ప్రయోజనాలు: ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు కొని నిల్వ చేసుకోవచ్చు. తరచుగా మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డబ్బు, సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా వేసవిలో నిమ్మకాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిట్కాతో వర్షాకాలంలో కూడా నిమ్మకాయలు పాడవకుండా తాజాగా ఉంటాయి.

5 / 5