- Telugu News Photo Gallery How many days can a newly married couple get a divorce.. What does the law say?
Divorce: నవ దంపతులు ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు ?.. చట్టం ఏం చెబుతోంది?
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన అనుభవం అని అంటుంటారు. కానీ ఈ రోజుల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దంపతులు మధ్య తరచు వివాదాలు జరగడంతో అవి విడాకులు తీసుకునే పరిస్థితికి దారితీస్తున్నాయి.
Updated on: Jul 05, 2023 | 2:49 PM

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన అనుభవం అని అంటుంటారు. కానీ ఈ రోజుల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దంపతులు మధ్య తరచు వివాదాలు జరగడంతో అవి విడాకులు తీసుకునే పరిస్థితికి దారితీస్తున్నాయి.

వాస్తవానికి భార్యభర్తల మధ్య ప్రేమ, ఒకరినొకరకు అర్ధం చేసుకనే స్వభావం, సఖ్యత లేనప్పడు విడాకులు తీసుకోవచ్చు. అలాగే అభిప్రాయాలు, అభిరుచిలు కూడా కలవనప్పడు పరస్పర అంగీకారంతో విడిపోవచ్చు. దంపతులు కచ్చితంగా విడిపోవాల్సిందే అని నిర్ణయించుకున్నప్పుడు న్యాయవ్యవస్థను ఆశ్రయించి లీగల్‌గా విడిపోవచ్చు.

ఒకవేళ పెళ్లైన నెలరోజులకే దంపతులు విడిపోవాలనుకుంటే వారు చేయాలనే సందేహం వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో భార్యభర్తలు కనీసం ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని చాలామంది చెబుతుంటారు. కానీ కొత్తజంట మధ్య సయోధ్య కుదరకపోతే వివాహం అయిన వారం రోజుల తర్వాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చట్టం చెబుతోంది.

అయితే కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేయడానికి 6 నెలల సమయం ఇస్తుంది. అయితే ఈలోపు వారు మళ్లీ కలసి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కోర్టు భావిస్తుంది.

విడాకులు, న్యాయపరంగా విడిపోవడం అనేవి రెండూ కూడా హిందూ వివాహ చట్టం 1955 కిందకే వస్తాయి. పెళ్లయిన జంటలు లీగల్‌గా విడిపోవాలనుకున్నప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు వారికి కోర్టు విడివిడిగా జీవించేందుకు అనుమతి ఇస్తుంది. ఈలోపు ఆ జంట తమ వైవాహిక జీవితం గురించి మళ్లీ ఆలోచించి సరైర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది.




