అంతే కాకుండా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుంది. వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు చలికాలం అంతా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి నీటిలో స్నానం చేయడం గుండెకు కూడా మంచిది. కానీ వేడి నీటి స్నానం అందరికీ మంచిది కాదు. ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు.