వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక క్యారెట్ తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. అయితే క్యారెట్ ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఇక దీనిని కొందరు జ్యూస్‌గా తీసుకుంటే మరికొంత మంది మాత్రం పచ్చిగా తినడం, ఇంకొంత మంది వంట చేసుకొని తింటుటారు.అయితే ఇప్పుడు మనం వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిని ఈ సీజన్‌లో తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
Updated on: Aug 06, 2025 | 8:10 PM

క్యారెట్‌లో విటమిన్ ఏ, కెరోటిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తీసుకోవడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వర్షాకాలంలో అనేక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ అటాక్ చేస్తుంటాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.అందువలన ఇలాంటి సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.

ఇలాంటి సమయంలో క్యారెట్ జ్యూస్ శరీరానికి అద్భుతంగా పని చేస్తుందంట. ఇద గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా, చర్మ సమస్యల నుంచి కాపాడుతుందంట. అంతే కాకుండా వర్షాకాలంలో ప్రతి రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. కాగా, అవి ఏవో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

క్యారెట్స్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందంట. మరీ ముఖ్యంగా కటి దృష్టిమెరుగు పరచడంలో కీలక పాత్రపోషిస్తుందంట. అంతే కాకుండా క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వలన ఇది కాలేయ పనితీరును మెరుు పరుస్తుందంట. కాలేయాన్ని శుభ్రపరిచి, శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించేస్తుందంట.

carrot juice

అలాగే ప్రతి రోజూ క్యారట్ జ్యూస్ తాగడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని ఇస్తాయంట. అలా జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.



