- Telugu News Photo Gallery Healthy Ways to Gain Weight If You're Underweight add these fruits in your diet
Underweight: బరువు తక్కువగా ఉన్నారని బాధపడుతున్నారా..? అయితే ఈ ఫ్రూట్స్ తీసుకోండి చాలు..
Underweight issue: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ట్రిక్స్‌ని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బరువు తక్కువగా ఉన్నవారు పెరగడానికి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అలాంటి వారు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా బరువును పెంచుకోవచ్చు. బరువు పెరగడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..
Updated on: Jun 01, 2022 | 6:17 PM

वजन घटाना भले ही एक टास्क हो, लेकिन कुछ लोगों के लिए वजन को बढ़ाना भी बहुत मुश्किल हो जाता है. अगर वे बाहर मिलने वाला जंक फूड खाते हैं, तो ये शरीर को बीमारियों का घर भी बना सकता है. आप इन फूड्स का सेवन करके अंडरवेट की प्रॉब्लम को दूर कर सकते हैं, साथ ही ये आपको हेल्दी भी रखेंगे.

మామిడి: వేసవిలో ఎక్కువగా తినే ఈ పండు రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండులో అనేక విటమిన్లు సమృద్ధి ఉన్నాయి. ఈ పండు తినడంతోపాటు జ్యూస్‌గా కూడా చేసుకోని తాగవచ్చు. మీ బరువు తక్కువగా ఉన్నట్లయితే.. మ్యాంగో షేక్ లాంటివి తీసుకుంటే ఈజీగా బరువు పెరగవచ్చు.

అరటిపండు: తక్షణ శక్తిని ఇచ్చే అరటిపండు బరువును పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ లక్షణాలు ఆరోగ్యకరమైన రీతిలో బరువును పెంచుతాయి. అదనంగా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. మీరు దీని షేక్ తాగడం ద్వారా బరువు పెరగవచ్చు.

ఎండుద్రాక్ష: డ్రై ఫ్రూట్స్ కేటగిరీలో వచ్చే ఎండు ద్రాక్ష బరువును కూడా పెంచుతుంది. ఎండు ద్రాక్షను రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఈ నీటిని తాగండి. దీంతోపాటు నానబెట్టిన ఎండుద్రాక్షను తినండి.

అంజీర్: ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బరువు పెరగడంలో ఎఫెక్టివ్ గా ఉండే ఈ పండును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే, అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

బరువు తగ్గడానికి ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.




