- Telugu News Photo Gallery Health Benefits Of Starfruit: Nutritional and medicinal properties of Star fruit, Know Details
Starfruit Benefits: అజీర్ణం నుంచి స్ట్రోక్ వరకు సర్వరోగ నివారిణి ఈ పండు.. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే లాగించేయండి!
స్టార్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆషా మాషా పండు కాదండోయ్.. అజీర్ణం నుంచి స్ట్రోక్, గుండె సమస్యల వరకు అన్నింటి నుంచి దివ్యౌషధం. ఈ పండును ఆంగ్లంలో 'స్టార్ ఫ్రూట్' అంటారు. కానీ ఈ పండు గురించి చాలా మంది గ్రామీణ ప్రజలకు తెలియదు. ఇది రుచికి పులుపుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. పచ్చగా ఉండే స్టార్ ఫ్రూట్స్ పచ్చివి. ఇవి పుల్లగా ఉంటాయి. అందుకే కాస్త పసుపు రంగులో ఉన్నవి చూసి..
Updated on: Mar 13, 2024 | 8:28 PM

స్టార్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆషా మాషా పండు కాదండోయ్.. అజీర్ణం నుంచి స్ట్రోక్, గుండె సమస్యల వరకు అన్నింటి నుంచి దివ్యౌషధం. ఈ పండును ఆంగ్లంలో 'స్టార్ ఫ్రూట్' అంటారు. కానీ ఈ పండు గురించి చాలా మంది గ్రామీణ ప్రజలకు తెలియదు. ఇది రుచికి పులుపుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు.

పచ్చగా ఉండే స్టార్ ఫ్రూట్స్ పచ్చివి. ఇవి పుల్లగా ఉంటాయి. అందుకే కాస్త పసుపు రంగులో ఉన్నవి చూసి కొనుక్కోవాలి. ఇవి తియ్యగా ఉంటాయి. లేకపోతే, పచ్చిగా ఉండే పండు చాలా పుల్లగా ఉంటుంది. ఈ పండు వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సరైన జీర్ణక్రియ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. క్రమరహిత ప్రేగు కదలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్‌తోపాటు B విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ ఆరోగ్యం, స్ట్రోక్, గుండె సమస్యల నివారణలో స్టార్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది.

పండుతో పాటు దీని ఆకులు కూడా కడుపుకు చాలా మేలు చేస్తాయి. కడుపులోని అల్సర్లను నయం చేయడంలో స్టార్ ఫ్రూట్ ఆకులు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఈ పండు జుట్టును బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

స్టార్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే శరీరంలోని సెల్యులార్ డ్యామేజ్‌ను నిరోధించడంలో సహాయపడే సహజ యాంటీఆక్సిడెంట్‌గా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.





























