Ajwain Leaves Benefits : మీ ఇంట్లో వాము చెట్టు ఉందా..? వర్షాకాలంలో రోజూ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఎన్నో..
వాము ఆకులు సుగంధం, ఘాటుగా ఉంటాయి. వాము ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను రోజూ నమిలి తింటుంటే, అందులోని ఔషధ గుణాలు శరీరంలో ఎన్నో అద్భుతాలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో వాము ఆకు ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 22, 2025 | 2:47 PM

వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. వాము ఆకు తింటుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా వున్నవారు వాము ఆకు తింటే సమస్య తగ్గుతుంది.ముక్కు దిబ్బడతో ఇబ్బందిపడుతున్న వారు కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ సమస్య తగ్గిపోతుంది.

వాము ఆకుల్లో విటమిన్ ఎ, సి, సెలీనియం, జింక్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో, హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే శీతలీకరణ లక్షణాలు కూడా వాము ఆకులో ఉన్నాయి.

అధిక రక్తపోటు సమస్య వున్నవారు వాము ఆకు తింటే బీపీ అదుపులో వుంటుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు వాము ఆకును తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా వాము కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాము డికాషన్‌ను తాగితే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.

వాము ఆకులు తింటే శరీరం నుండి ట్యాక్సిన్స్ నుండి బయటికి వెళ్తాయి. కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఉన్నవారికి కూడా వాము ఆకు మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.

కొందరు మహిళలు పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారిలో సమస్యల్ని తగ్గించడంలో వాము ఆకులు మంచి నివారిణిగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.




