- Telugu News Photo Gallery Get rid of white hair with bitter gourd juice, a complete stop to hair fall
ఈ వెజిటబుల్ జ్యూస్‌తో తెల్లజుట్టు దూరం.. హెయిర్‌ఫాల్ స్టాప్..
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఖరీదైన షాంపోలు, ఆయిల్స్ కాదు.. కాకర రసం చాలు అంటున్నారు నిపుణులు. కాకర రసం జుట్టుకు పట్టించడం వల్ల సమస్యలు తగ్గిపోతాయని.. కుదుళ్లు దృఢంగా, కురులు ఒత్తుగా తయారవుతాయంటున్నారు. మరి.. కాకర రసాన్ని ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Sep 20, 2025 | 1:39 PM

కాకరకాయ చేదుగా ఉన్న కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేకాదు చర్మం, జుట్టు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుండి. ఈ చేదు కూరగాయను ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతారు. అయితే ఇది మీ జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

కాకరకాయలో విటమిన్ బి1, బి2, బి3, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫాస్పరస్, జింక్, మాంగనీస్ జుట్టు పెరుగుదలకు ముఖ్యమైనవి. కాకర రసం జుట్టు రాలడాన్ని తగ్గించే ఔషధంలా పనిచేస్తుంది. అరకప్పు కాకర రసంలో చెంచా కొబ్బరి నూనె కలిపి జుట్టు, మాడుకు పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చెయ్యండి. 40నిమిషాలు అలాగే ఉంచి ఆరిన వెంటనే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య ఉండదు.

వెంట్రుకలు నిస్తేజంగా, మెరుపు కోల్పోయిన కూడా కాకరకాయ రసాన్ని ఉపయోగించవచ్చు. కాకరకాయ రసంలో పంచదార కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయండి. తరచూ ఇలా చేయడం వల్ల క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇది మీ జుట్టు మూలాలను బలపరుస్తుంది. కాకరకాయ ముక్కను జుట్టు మూలాలపై రుద్దడం వల్ల చుండ్రు చాలా వరకు తొలగిపోతుంది.

జుట్టు పెరుగుదలకు కాకరకాయ జ్యూస్ సహాయపడుతుండు. దీనిలో ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు రసం రక్త ప్రసరణకు సహాయపడుతుంది. తాజా చేదు కాకరకాయ రసాన్ని వారానికి ఒకసారి జుట్టుకు పట్టిస్తే కొద్ది రోజుల్లోనే జుట్టు నెరసిపోవడం ఆగిపోతుంది.

అరకప్పు కాకర రసం, అరకప్పు పెరుగు, రెండు చెంచాల నిమ్మరసం కలిపి కొంత భాగాన్ని మాడుకు పట్టించి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత మిగిలిన భాగాన్ని వెంట్రుకలకు మొత్తం పట్టించి 30 నిమిషాల ఆరబెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే పొడిబారిన జుట్టుకు మంచి నిగారింపును సొంతం చేసుకుంటుంది.




