Telugu News » Photo gallery » G20 Meet Chandrababu Naidu Speech on Digital Knowledge PM Modi Acknowledges
G20 Meet: G20పై ఆఖిలపక్ష సమావేశం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు..
Shiva Prajapati |
Updated on: Dec 06, 2022 | 12:07 PM
G20 Meet: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సూచనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందాయి. ఈ మీటింగ్‌కు బెంగాల్ సీఎం మమత, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
Dec 06, 2022 | 12:07 PM
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సూచనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందాయి. ఈ మీటింగ్‌కు బెంగాల్ సీఎం మమత, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
1 / 6
G20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆయన ఏం చేశారు. చంద్రబాబు ఎందుకు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
2 / 6
ఫస్ట్‌టైమ్ దేశంలోని 40 ప్రధాన పార్టీలను పిలిచి జీ20 సమ్మిట్‌పై చర్చించింది కేంద్రం. ఏం అజెండా పెడదామంటూ అభిప్రాయాలు అడిగింది. ఈ సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఉపన్యసించారు.
3 / 6
చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. భారత్ దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు చంద్రబాబు.
4 / 6
వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశంగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలం.. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలన్నారు. అలాగే దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు చంద్రబాబు.
5 / 6
ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండి.. కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అక్కడే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.