Forts in India: మన దేశంలోని ఈ కోటలు అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. పూర్తిగా చూడాలంటే రోజు పడుతుంది
భారతదేశం ఆధ్యాత్మికత మాత్రమే కాదు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా విదేశీయులను ఆకర్షిస్తాయి. మన దేశంలో చాలా చారిత్రక భవనాలు, కోటలు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు రెండు కళ్ళు చాలవు అన్నంత గొప్ప వాస్తు కళా సంపదకి నెలవు. ఈ రోజు మనం భారతదేశంలోని 5 కోటల గురించి తెలుసుకుందాం.. ఈ కోటలు చాలా పెద్దవి మరియు, ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. వీటిని చూడాలంటే ఒక్క రోజు చాలదు అనిపిస్తాయి.
Updated on: Jul 25, 2025 | 12:29 PM

భారతదేశంలోని అతిపెద్ద కోటల జాబితాలో మొదటి స్థానంలో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోట నిలుస్తుంది. ఇది దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఒక కొండపై ఉంది. ఈ కోట మేవార్‌కు గర్వకారణం. రాణి పద్మిని , రాణా రతన్ సింగ్ వంటి చారిత్రక వ్యక్తులతో ముడిపడి ఉంది. కోట లోపల మీరు అనేక ఇతర చిన్న రాజభవనాలు, దేవాలయాలు, నీటి వనరులను కనుగొంటారు. ఈ కోటని పూర్తిగా చూడాలంటే.. దీనిని సందర్శించడానికి ఒక రోజుకి పైగా సమయం పడుతుంది. (క్రెడిట్: great_chittorgarh)

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌గఢ్‌ను 15వ శతాబ్దంలో రావు జోధా నిర్మించారు. ఈ కోట దాదాపు 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నిర్మించబడింది. ఈ భారీ కోట గోడలు పర్యాటకులను చరిత్రకు దగ్గరగా తీసుకువెళతాయి. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది. దీనిలో పూర్వకాలంలో రాజులు ఉపయోగించిన కత్తులు, ఆయుధాలు, దుస్తులు, పల్లకీలు ఉన్నాయి. (క్రెడిట్: beautyofindiainsta)

గ్వాలియర్ కోట భారతదేశంలోని అతిపెద్ద, బలమైన కోటలలో ఒకటి. ఇది దాదాపు 3 కిలోమీటర్ల పొడవు .. 1 కిలోమీటర్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నిటారుగా ఉన్న కొండపై నిర్మించబడింది. నిలువుగా ఉన్న కోట బలాన్ని అంచనా వేయవచ్చు. ఈ కోట లోపల, గుజారి మహల్, మాన్ మందిర్, సాస్-బహు ఆలయం, టెలిస్కోప్ పాయింట్ వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు. (క్రెడిట్: mysoretusker)

గోల్కొండ కోట పాత హైదరాబాద్‌లో ఉంది. ఇది దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది కుతుబ్ షాహి రాజవంశం రాజధానిగా ఉండేది. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. కోహినూర్ వజ్రం లభించిన ప్రాంతం ఇదే అని కొంతమంది చెబుతారు. ఈ కోట ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన ద్వారం వద్ద చప్పట్లు కొడితే.. ఆ శబ్దం కోట పైకి చేరుకుంటుంది.

ఢిల్లీ ఎర్రకోట గురించి అందరికీ తెలుసు. ఇది మన దేశంలోని అతిపెద్ద, అత్యంత అందమైన కోటలలో ఒకటి. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1648 లో నిర్మించాడు. ఎర్రటి రాళ్లతో నిర్మించిన ఈ కోటలో దివాన్-ఎ-ఆమ్, దివాన్-ఎ-ఖాస్, రంగ్ మహల్ , మోతీ మసీదు వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. (క్రెడిట్: delhiian)




