AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి ఏడిపిస్తున్న గోకుడు గజ్జి, మొండి దురదకు.. ఇది పూస్తే నిముషాల్లోనే రిలీఫ్

ప్రస్తుత సమాజంలో చర్మ వ్యాధులు, ముఖ్యంగా గజ్జి, తామర వంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ప్రకృతి వైద్య నిపుణులు సహజ చిట్కాలను చెప్పారు. ఇది పాటిస్తే సోరియాసిస్, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 17, 2026 | 3:01 PM

Share
పటిక వాడకంలో జాగ్రత్తలు పాటించడం వైద్యులు చెబుతున్నారు. పటికను అధిక మోతాదులో వాడితే ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని లోపలికి తీసుకునేటప్పుడు, ఒక లీటరు నీటిలో కేవలం 3 గ్రాముల పటికను మాత్రమే కలిపి, ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. ఒకేసారి మొత్తం నీటిని తాగడం సరైనది కాదు. అలాగే, స్నానానికి పటిక నీటిని వాడాలనుకుంటే, 50 గ్రాముల పటికను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత, ఉదయం ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు ఇంకా చర్మాన్ని తుడుచుకోవడానికి వాడవచ్చు.

1 / 5

పటిక రాయిని నేరుగా చర్మంపై రుద్దే పద్ధతిలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పటిక రాయిని నీటిలో ముంచి, స్కిన్ పై కేవలం ఒక్కసారి తుడవాలి. సబ్బు రుద్దినట్లు గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మంట వస్తాయని అంటున్నారు. 
రోజుకు ఐదారు సార్లు, ప్రతి రెండు మూడు గంటలకొకసారి ప్రభావిత ప్రాంతంలో పటిక రాయిని ఇలా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పటిక రాయిని నేరుగా చర్మంపై రుద్దే పద్ధతిలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పటిక రాయిని నీటిలో ముంచి, స్కిన్ పై కేవలం ఒక్కసారి తుడవాలి. సబ్బు రుద్దినట్లు గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మంట వస్తాయని అంటున్నారు. రోజుకు ఐదారు సార్లు, ప్రతి రెండు మూడు గంటలకొకసారి ప్రభావిత ప్రాంతంలో పటిక రాయిని ఇలా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2 / 5
పటిక అనేది ఔషధం లాంటిదని, సరైన మోతాదులో మాత్రమే వాడాలని, అధికంగా లేదా తక్కువగా వాడితే ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని చెబుతున్నారు. వ్యక్తుల శరీర తత్వాలను బట్టి పటిక ప్రభావం మారుతుందని కూడా తెలిపారు. గజ్జి, తామర, శరీరమంతా దురదలు ఉన్నప్పుడు పటిక అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. దురదలు అనేవి శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు దానిని బయటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నమని ఆయన వివరించారు

3 / 5
దురద పెట్టినప్పుడు గోకడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఆ ప్రాంతంలో వేడి ఉత్పత్తి అయి ఇన్‌ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ఇది శరీర రక్షణ యంత్రాంగం. అయితే, గోకడం వల్ల చర్మానికి నష్టం జరిగి కొత్త ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అర స్పూను పటిక పొడిని ఒక కోడిగుడ్డులో బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

4 / 5
ఈ పేస్ట్‌ను శరీరంలో గజ్జి, తామర, దురదలు ఉన్న ప్రదేశంలో పూయాలి. శరీరం మొత్తం దురదలు ఉంటే, మొత్తం శరీరానికి పూయవచ్చు. ఈ పేస్ట్ పూర్తిగా ఆరిన తర్వాత, సుమారు మూడు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ చికిత్స చర్మం మృదువుగా మారడానికి, మంటలు, దురదలు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

5 / 5
Follow Us