- Telugu News Photo Gallery Fiber Benefits: Health care do not ignore these symptoms related to lack of fiber
Fiber Benefits: మీ శరీరంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయా..? ఫైబర్ లోపం కావచ్చు..!
Fiber Benefits: ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ కూడా ఎంతో అవసరం. ఫైబర్ లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి..
Updated on: May 09, 2022 | 8:11 AM

Fiber Benefits: ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ కూడా ఎంతో అవసరం. ఫైబర్ లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

మలబద్ధకం: శరీరంలో ఫైబర్ లోపం ఉంటే, మీరు తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. పొట్టను శుభ్రం చేయనప్పుడు గ్యాస్, ఎసిడిటీ రావడం మొదలవుతుంది. మలబద్ధకం సమస్య చాలా రోజులు కొనసాగితే, అప్పుడు పైల్స్ కూడా సంభవించే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

బరువు పెరగడం: ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థలో ఏర్పడే అడ్డంకుల వల్ల ఆహారం జీర్ణం కాకుండా క్రమంగా బరువు పెరగడం మొదలవుతుంది. ఇలా పెరుగుతున్న బరువు మిమ్మల్ని స్థూలకాయానికి గురి చేస్తుంది.

బెడ్ కొలెస్ట్రాల్: ఫైబర్ లేకపోవడం వల్ల, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం మొదలవుతుంది. దీనికి కారణం శరీరంలో ఫైబర్ కంటెంట్ లేకపోవడమే కారణమని తెలుసుకోండి.

అలసట: జీర్ణవ్యవస్థపై భారం పెరగడంతో ఆహారాన్ని జీర్ణం అయ్యేందుకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తరచుగా అలసిపోతూ ఉంటారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి దోసకాయలు, ఇతర ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినండి.




