- Telugu News Photo Gallery Egg Coffee to Nitro Brew: The Strange Coffee Varieties You Must Know This International Coffee Day
Coffee: వామ్మో.. ఇదేందయ్యా.. పిల్లి మలం.. కోతి ఉమ్మితో కాఫీ..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ తాగేవాళ్లకు ఈ రోజు ఒక పెద్ద పండుగ లాంటిది..! కాఫీ మనకు తక్షణ శక్తిని ఇచ్చి, మైండ్‌ను ఫ్రెష్ చేస్తుంది. కొద్దిగా తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదే. మనందరికీ లాట్టే, కాపుచినో తెలుసు. కానీ కాఫీ ప్రపంచంలో కొన్ని వెరైటీలు, పిచ్చెక్కించే రకాలు ఉన్నాయి. వీటి గురించి వింటే మీరు షాక్ అవుతారు..
Updated on: Oct 01, 2025 | 11:19 AM

ప్రపంచంలో ఎన్నో వెరైటీ కాఫీలు ఉన్నాయి. సాధారణంగా కాఫీ గింజలను అరబికా, రోబస్టా లాగా మామూలుగా పండిస్తారు. కానీ, కొన్ని కాఫీ గింజలను మనుషులు కాకుండా జంతువులు ప్రాసెస్ చేస్తాయి. అవేంటో చూద్దాం.

కోపి లువాక్ : దీన్నే పిల్లి మలం కాఫీ అని కూడా అంటారు. కాఫీ పండించాక, వాటిని సివెట్ పిల్లులకు తినిపిస్తారు. ఆ గింజలు పిల్లి కడుపులో అరిగి, మలంతో బయటకు వస్తాయి. వాటిని శుభ్రం చేసి కాఫీ తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ వల్ల కాఫీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా మారింది.

మంకీ స్పిట్ కాఫీ: పిల్లి కాఫీ లాగే, ఇది కోతుల ద్వారా తయారవుతుంది. ఫార్మోసాన్ మకాక్ అనే కోతులు కాఫీ గింజలను తింటాయి. పూర్తిగా మింగకుండా కాస్త నమిలి ఉమ్మివేస్తాయి.తర్వాత ఆ ఉమ్మేసిన గింజలను సేకరించి, ప్రాసెస్ చేస్తారు. ఈ కాఫీ రుచి కూడా చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది.

ఎగ్ కాఫీ: ఈ కాఫీ వెరైటీ వియత్నాంలో చాలా ఫేమస్. పాలు లేని రోజుల్లో పాల బదులు గుడ్డును వాడి కాఫీ చేసేవారు. ఇప్పుడు పాలు, గుడ్డును కలిపి చిలికి క్రీమ్ లాగా తయారుచేసి కాఫీ పైన పోస్తారు. అందుకే దీనికి క్రీమీ టెక్చర్ వస్తుంది.

నైట్రో బ్రూ కాఫీ: ఈ కాఫీ చూస్తే బీర్ లాగా నురగతో ఉంటుంది. ఎలా చేస్తారు. ఈ కాఫీలో నైట్రోజన్ గ్యాస్ను కలుపుతారు. దీనివల్ల కాఫీ చాలా చిక్కగా, పైన బీర్ లాంటి నురుగుతో వస్తుంది. తాగడానికి చాలా ఉత్సాహంగా, కొత్తగా ఉంటుంది.




