- Telugu News Photo Gallery Eczema and itching can be easily reduced with this oil, check here is details
Eczema Reduce Tips: ఇలా చేస్తే.. గజ్జి, తామర, దురదను ఈజీగా తగ్గించుకోవచ్చు..
వేసవి కాలంలో చాలా ఇబ్బంది ఫేస్ చేసే సమస్యల్లో గజ్జి, తామర, దురద కూడా ఒకటి. ఎండ వేడి కారణంగా ఎక్కువగా చెమట అనేది పడుతుంది. ఈ చెమట నిల్వ ఉండే భాగాల్లో బట్టలు రాపిడికి గురి అవ్వడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అక్కడ ఫంగస్ ఏర్పడి.. తామర, గజ్జి, దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ గజ్జి, తామర సమస్యలు అంటు వ్యాధులు. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా అంటుకుంటాయి. వీటిని తగ్గించడంలో ఈ చిట్కా చక్కగా ఉపయోగ పడుతుంది. సిట్రోడరా ఆయిల్‌లో యాంటీ ఫంగస్ లక్షణాలు..
Updated on: Apr 29, 2024 | 6:08 PM

వేసవి కాలంలో చాలా ఇబ్బంది ఫేస్ చేసే సమస్యల్లో గజ్జి, తామర, దురద కూడా ఒకటి. ఎండ వేడి కారణంగా ఎక్కువగా చెమట అనేది పడుతుంది. ఈ చెమట నిల్వ ఉండే భాగాల్లో బట్టలు రాపిడికి గురి అవ్వడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అక్కడ ఫంగస్ ఏర్పడి.. తామర, గజ్జి, దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఈ గజ్జి, తామర సమస్యలు అంటు వ్యాధులు. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా అంటుకుంటాయి. వీటిని తగ్గించడంలో ఈ చిట్కా చక్కగా ఉపయోగ పడుతుంది. సిట్రోడరా ఆయిల్‌లో యాంటీ ఫంగస్ లక్షణాలు, బయో ఆక్టివ్ కెమికల్స్, సీఎమ్‌డి వంటివి ఉంటాయి.

తామర, గజ్జి ఉన్న చోట ఈ ఆయిల్ రాస్తే.. త్వరగా తగ్గుతుంది. ఈ ఆయిల్ మెడికల్ షాపుల్లో, ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. దురద సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ ఆయిల్‌ను కొబ్బరి నూనెలో కలిపి రాయాలి.

రోజూ రెండు పూటలా.. సమస్య ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గజ్జి, తామర సమస్య 15 నుంచి 20 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. తామర, గజ్జి మచ్చలు కూడా తగ్గిపోతాయి.

ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఎండలో వచ్చే దురద, మంట నుంచి కూడా ఉపశనం కలుగుతుంది. అదే విధంగా గోర్లలో ఫంగస్ చేరి.. ఆ భాగంలో కూడా ఉబ్బినట్టు ఉంటుంది. ఈ సిట్రోడరా ఆయిల్‌లో ముంచడం వల్ల ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.




