- Telugu News Photo Gallery Eating okra at least once a week has many health benefits, Check Here is Details in Telugu
Okra: వారంలో ఒక్కసారైనా బెండకాయ తినాల్సిందే.. లేకుంటే పోషకాలన్నీ మిస్!
కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలతో అనేక రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. వారంలో ఒక్కసారైనా బెండకాయలు తినాలని అంటున్నారు. బెండకాయల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..
Updated on: Jan 26, 2025 | 1:50 PM

బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. బెండకాయలతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది బెండకాయలను తినడం ఇష్టం ఉండదు. కానీ వారంలో ఒక్కసారైనా బెండకాయలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో బెండకాయలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. బెండకాయల నీరు తాగినా, బెండకాయలతో చేసిన వంటలు తిన్నా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్‌గా ఉంటాయి.

బెండకాయల్లో ఉండే మ్యూకస్ అనే పదార్థం.. గ్యాస్ట్రిక్, అసిడిటీ, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణలు పెరగకుండా అడ్డుకుంటుంది. రక్తం గడ్డ కట్టకుండా సహాయ పడుతుంది.

బెండకాయల్లో ఉండే మ్యూకస్ అనే పదార్థం.. గ్యాస్ట్రిక్, అసిడిటీ, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణలు పెరగకుండా అడ్డుకుంటుంది. రక్తం గడ్డ కట్టకుండా సహాయ పడుతుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బెండకాయల్లో నీటి శాతం కూడా ఎక్కువే ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని అందంగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























