- Telugu News Photo Gallery Eating black pepper and honey together can control diabetes and cholesterol
Honey Pepper mixture: దీన్ని తేనెతో కలిపి తింటే సూపర్ బెనిఫిట్స్.. ఒంట్లోని షుగర్, కొలెస్ట్రాల్ మీ కంట్రోల్‌లోనే..
ఆయుర్వేదంలో తేనె, నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. నల్ల మిరియాలను తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు వంటివి వెంటనే నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసనాళంలో వాపును తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 21, 2025 | 7:13 PM

తేనె, నల్లమిరియాల కాంబినేషనలో విటమిన్ కె, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు.. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు ఉన్నవారికి తేనె, మిరియాల పొడి కలిపి తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గొంతులో కఫం, నోటి దుర్వాసన, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు ఉన్నవారికి తేనె, నల్లమిరియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిటికెడు నల్లమిరియాల పొడిని, తేనెతో కలిపి తిన్న తర్వాత అరగంటపాటు నీళ్లు తాగకుండ ఉంటే త్వరగా ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.

ఆయుర్వేదంలో నల్ల మిరియాలు నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మిరియాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. బ్లాక్ పెప్పర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ రెండింటి కలిపి తింటే పొట్టకు సంబంధించిన చాలా సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపుబ్బరం నుంచి రిలీఫ్ కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.




