Interesting Facts: ఇది విన్నారా.. రాత్రి 9 గంటల తర్వాత తింటే పక్షవాతం వస్తుందట!
ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో తినడానికి కూడా సరైన సమయం దొరకడం లేదు. అంతా బిజిబిజీ అయిపోయింది. ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అదే తింటున్నారు. కానీ దీని వల్ల వారి ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో అన్న సంగతి మర్చిపోతున్నారు. చాలా మందికి రాత్రుళ్లు లేటుగా తినే అలవాటు ఉంటుంది. తొమ్మిది లేదా 12 గంటల మధ్యలో తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల సమస్య కాదని..
Updated on: Apr 21, 2024 | 1:57 PM

ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో తినడానికి కూడా సరైన సమయం దొరకడం లేదు. అంతా బిజిబిజీ అయిపోయింది. ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అదే తింటున్నారు. కానీ దీని వల్ల వారి ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో అన్న సంగతి మర్చిపోతున్నారు.

చాలా మందికి రాత్రుళ్లు లేటుగా తినే అలవాటు ఉంటుంది. తొమ్మిది లేదా 12 గంటల మధ్యలో తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల సమస్య కాదని అనుకుంటారు. కానీ ఇలానే ప్రతీ రోజు తింటే మాత్రం ఖచ్చితంగా జబ్బుల బారిన పడతారని నిపుణులు అంటున్నారు.

భోజనం చేసే సమయం మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్ర చెడిపోవడం, బీపీ, షుగర్ రావడం వంటి సమస్యలే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అకాశం ఉంది.

ప్రతీ రోజూ ఆలస్యంగా భోజనం చేయడం వల్ల భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉందట. రాత్రి పూట ఆసల్యంగా భోజనం చేయడం వల్ల రక్త పోటు, చక్కెర స్థాయిల్లో మార్పులు వచ్చి.. భవిష్యత్తులో పక్ష వాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుందట. దీని వల్ల మెదడులోని రక్త నాళం పగిలి.. రక్తస్రావం జరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి భోజనం చేసిన వెంటనే అస్సలు పడుకోకూడదు. దీని వల్ల కూడా పక్షవాతం రావచ్చని నిపుణులు అంటున్నారు.





























