- Telugu News Photo Gallery Science photos Mount Erebus: This Volcano In Antarctica Is Spewing 80 Grams Of Gold Dust Everyday, NASA Shares Pictures
Mount Erebus: ఆహా ఏం అదృష్టం.. బంగారాన్ని బయటికి వెదజల్లుతోన్న అగ్నిపర్వతం! నాసా పంపిన ఫొటోలు ఇవే..
ఈ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఇది కథ కాదు.. నిజంగా నిజం. అయితే ఈ బంగారం వర్షం కురుస్తోంది ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే.. ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అంటార్కిటికాలో ఉన్న ఈ అగ్ని పర్వతంలో బంగారం కరిగిపోయి బయటికి రేణువుల రూపంలో చిమ్ముతోంది. బంగారం మాత్రమే కాదు, అనేక ఇతర విలువైన ఖనిజాలు దీని నుంచి బయటకు వస్తున్నాయి..
Updated on: Apr 21, 2024 | 1:17 PM

ఈ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఇది కథ కాదు.. నిజంగా నిజం. అయితే ఈ బంగారం వర్షం కురుస్తోంది ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే.. ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అంటార్కిటికాలో ఉన్న ఈ అగ్ని పర్వతంలో బంగారం కరిగిపోయి బయటికి రేణువుల రూపంలో చిమ్ముతోంది. బంగారం మాత్రమే కాదు, అనేక ఇతర విలువైన ఖనిజాలు దీని నుంచి బయటకు వస్తున్నాయి.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఈ సమాచారాన్ని నివేదించింది. అంటార్కిటికాలో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి బంగారం, ఇతర విలువైన ఖనిజాలు వెలువడుతున్నాయని ఫొటోలతో సహా వెల్లడించింది.

భూమి మధ్యలో నుంచి వెలువడుతున్న లావాతో పాటు విలువైన ఖనిజాలు కూడా బయటకు వస్తున్నాయని నాసా పేర్కొంది. అగ్నిపర్వతం నుంచి వచ్చే బంగారం పరిమాణం చాలా తక్కువేం కాదు. ప్రతిరోజూ దాదాపు 80 గ్రాముల బంగారం బయటికి వస్తోందట. దీని విలువ సుమారు 6 వేల డాలర్లు ఉంటుంది.

అయితే అక్కడ బంగారం వర్షం కురిసినా ఆ బంగారాన్ని సేకరించే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయు పీడనం వల్ల బంగారం స్ఫటికాల రూపంలో బయటకు వచ్చినా.. దాని చుట్టూ మరుగుతున్న లావా ఉన్నందున దానిని ఎవరూ సేకరించలేరు.

అయితే కొన్ని బంగారు రేణువులు గాలిలో కలిసిపోయి అగ్నిపర్వతం నుంచి 621 మైళ్ల దూరం వరకు చిమ్ముతున్నట్లు సమాచారం. అగ్నిపర్వతం నుండి పైకి లేచిన బంగారానికి సంబంధించిన చిత్రాలను నాసా అంతరిక్షం నుంచి ఉపగ్రహ చిగ్రతలను విడుదల చేసింది. కాగా మౌంట్ ఎరెబస్ అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకర అగ్నిపర్వతం.





























