- Telugu News Photo Gallery Does the curd turn sour in the sun, follow these tips, check here is details
Kitchen Hacks: ఎండలకు పెరుగు పుల్లగా అవుతుందా.. ఇలా చేస్తే సరి!
పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు లభిస్తాయి. కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అందులోనూ వేసవిలో ఎక్కువగా పెరుగుతోనే పని ఉంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే.. పెరుగు తినాల్సిందే. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ ఎండా కాలంలో పెరుగు పుల్లగా మారుతూ ఉంటుంది. పుల్లగా ఉంటే చాలా మందికి నచ్చదు. పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే..
Updated on: May 24, 2024 | 8:31 PM

పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు లభిస్తాయి. కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అందులోనూ వేసవిలో ఎక్కువగా పెరుగుతోనే పని ఉంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే.. పెరుగు తినాల్సిందే. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది.

ఈ ఎండా కాలంలో పెరుగు పుల్లగా మారుతూ ఉంటుంది. పుల్లగా ఉంటే చాలా మందికి నచ్చదు. పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే.. తోడు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దీంతో పెరుగు పుల్లగా మారకుండా ఉంటుంది. మరి అదెలాగో చూద్దాం.

పెరుగు అనేది ఎప్పుడైనా సరే పగలు కాకుండా.. రాత్రి పూట తోడు వేయండి. రాత్రిపూట వేడి అనేది తక్కువగా ఉంటుంది. దీంతో పెరుగు పులవకుండా ఉంటుంది. పగలు తోడు వేస్తే.. ఆ వేడికి పెరుగు పుల్లగా మారుతుంది.

పెరుగు అనేది ఎప్పుడైనా సరే పగలు కాకుండా.. రాత్రి పూట తోడు వేయండి. రాత్రిపూట వేడి అనేది తక్కువగా ఉంటుంది. దీంతో పెరుగు పులవకుండా ఉంటుంది. పగలు తోడు వేస్తే.. ఆ వేడికి పెరుగు పుల్లగా మారుతుంది.

పెరుగు పుల్లగా అవ్వడానికి కారణం.. మీరు తోడు వేసే పాత్రలు కూడా అవ్వొచ్చు. గాజు లేదా స్టీల్ గిన్నెలకు బదులు.. మట్టి కుండల్లో పెరుగు తోడు వేయడం వల్ల పుల్లగా మారకుండా.. తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా మట్టి కుండల్లో తోడు వేసిన పెరుగు ఆరోగ్యమే కాకుండా.. రుచిగా కూడా ఉంటుంది.




