- Telugu News Photo Gallery Doctor saved life of five year old boy who swallowed Door Padlock without surgery in Telangana
Telangana: ఆడుకుంటూ తాళం కప్ప మింగిన ఐదేళ్ల బాలుడు.. సర్జరీలేకుండానే ప్రాణాలు కాపాడిన డాక్టర్
ఆ బాలుడు నిజంగా అదృష్ట వంతుడు.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తల్లిదండ్రులు ఆ డాక్టర్ ను కనిపించే దేవుడుగా మొక్కుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఖమ్మం నగరంలో రాతి దర్వాజ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహాయిజ్ (5) ఇంటి బయట దొరికిన పాత తాళాన్ని తెచ్చి సబ్బుతో కడిగి ఊయల లో ఊగుతూ ఆడుకుంటూ ఆ తాళం కప్ప మింగాడు. వెంటనే బాలుడి తండ్రి జలీల్ గమనించి నగరం లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు..
Updated on: Nov 24, 2023 | 1:39 PM

ఆ బాలుడు నిజంగా అదృష్ట వంతుడు.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తల్లిదండ్రులు ఆ డాక్టర్ ను కనిపించే దేవుడుగా మొక్కుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఖమ్మం నగరంలో రాతి దర్వాజ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహాయిజ్ (5) ఇంటి బయట దొరికిన పాత తాళాన్ని తెచ్చి సబ్బుతో కడిగి ఊయల లో ఊగుతూ ఆడుకుంటూ ఆ తాళం కప్ప మింగాడు.

వెంటనే బాలుడి తండ్రి జలీల్ గమనించి నగరం లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్ రే తీసి పొట్టలో తాళం ఉందని శస్త్ర చికిత్స చేయాలని లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు భయపడ్డారు. ఖమ్మంలో సాయిరాం గ్యాస్ట్రో లివర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సాయి రామ్ గ్యాస్ట్రో లో ఆధునిక ఎండోస్కోపీ ద్వారా శస్త్ర చికిత్స చేయకుండానే తాళాన్ని బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు వైద్యుడు జంగాల సునీల్ కుమార్.

బాబు ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్ కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అతి క్లిష్టమైన సమస్యను శాస్త్ర చికిత్స లేకుండానే తాళాన్ని తీశామని, తల్లిదండ్రులు సకాలంలో స్పందించి బాలుణ్ణి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇప్పుడు బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పిల్లలకు ఇలాంటి వస్తువులు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు డాక్టర్ జంగాల సునీల్ కుమార్ సూచించారు.
