- Telugu News Photo Gallery Do you know why you shouldn't drink water immediately after eating fruits, Check Details
Health Tips: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసా..?
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందుకే రెగ్యులర్‌గా ఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతారు. కానీ వాటిని తిన్న వెంటనే చాలా మంది నీరు తాగుతారు. అయితే ఇటువంటి తప్పులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 28, 2025 | 7:48 AM

సీజన్స్ బట్టి రకరకాల పండ్లు మార్కెట్లో లభిస్తాయి. విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలను పండ్లు మన శరీరానికి అందిస్తాయి. అయితే, పండ్లు తిన్న తర్వాత చాలా మంది చేసే ఒక సాధారణ పొరపాటు పండ్లను తిన్న వెంటనే నీరు తాగడం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు: పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల అజీర్ణం, ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని వల్ల శరీరం పండ్ల నుండి పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడంతో పూర్తి ప్రయోజనాలు అందవు. ముఖ్యంగా పుల్లని పండ్ల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

శరీర pH మార్పులు : పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దీనివల్ల శరీర pH స్థాయిలు తగ్గుతాయి. కొన్ని పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పండ్లను తిన్న తర్వాత నీరు తాగితే, నీటి శాతం మరింత పెరిగి కొందరిలో వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

రక్తంలో చక్కెర పెరగడం : పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రమాదకరం. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు.

జలుబు, దగ్గు సమస్యలు: పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో కఫం పెరుగుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని మన పెద్దలు కూడా తరచుగా చెబుతూ ఉంటారు. కాబట్టి, పండ్లను భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తినడం ఉత్తమం, అంతేకాకుండా పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవాలి.




