- Telugu News Photo Gallery Do you know how good it is to eat curd in summer? check here is details in Telugu
Curd in Summer: వేసవి కాలంలో పెరుగు తింటే ఎంత మంచిదో తెలుసా..
వేసవి కాలం మొదలైపోయింది. రోజు రోజుకూ ఉష్ణోగ్రత లెవల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆరోగ్య పరంగా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆస్పత్రి పాలవ్వక తప్పదు. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా.. వడదెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని చల్ల బరిచే..
Updated on: Mar 16, 2024 | 1:29 PM

బ్యాక్టీరియా, ప్రోటీన్: మజ్జిగ కంటే పెరుగులో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేగులకు చాలా మేలు చేస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వేసవిలో ఎంత తక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బదులుగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఎండ ప్రభావం అంతగా అనిపించదు. వేసవిలో చాలా మంది పెరుగును క్రమం తప్పకుండా తింటుంటారు. ముఖ్యంగా పెరుగు వేసవిలో ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

సమ్మర్‌లో పెరుగు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో నీరు, ఎలక్ట్రోలైట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. హైడ్రేట్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయ పడుతుంది.

పెరుగు శరీరాన్ని డీ-టాక్సిఫై చేయడానికి కూడా సహాయపడుతుంది. శరీరం నుండి హానికారక టాక్సిన్స్ తొలగిస్తుంది.

జీర్ణ సమస్య: మీకు అజీర్ణం సమస్య ఉంటే, పెరుగు తినడం మంచిది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.




