- Telugu News Photo Gallery Do this to prevent the milk from spoiling quickly, check here is details in Telugu
Kitchen Hacks: పాలు త్వరగా విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఎంత జాగ్రత్త చేసినా సరే ఒక్కోసారి పాలు విరిగి పోవడం జరుగుతూ ఉంటాయి. దీంతో మహిళలకు చాలా బాధగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే ఒక్కోసారి ఇలా పాడైపోతూ ఉంటాయి పాలను సరిగ్గా నిర్వహించకపోతేనే పాలు విరిగి పోవడం జరుగుతుంది. మరి పాలు త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాలు విరిగి పోతున్నాయి అంటే ఇలా చేయండి. పాలను తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఇవి పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో..
Updated on: Jun 21, 2024 | 1:59 PM

ఎంత జాగ్రత్త చేసినా సరే ఒక్కోసారి పాలు విరిగి పోవడం జరుగుతూ ఉంటాయి. దీంతో మహిళలకు చాలా బాధగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే ఒక్కోసారి ఇలా పాడైపోతూ ఉంటాయి పాలను సరిగ్గా నిర్వహించకపోతేనే పాలు విరిగి పోవడం జరుగుతుంది. మరి పాలు త్వరగా పాడవ్వకుండా.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాలు విరిగి పోతున్నాయి అంటే ఇలా చేయండి. పాలను తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఇవి పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. ఇలా చేయడం వల్ల పాలు త్వరగా విరిగిపోవు.

చాలా మంది షాపింగ్స్ వెళ్లినప్పుడు పాలను ముందు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా షాపింగ్ చివరిలో పాలను తీసుకోండి. ఇంటికి రాగానే ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఎక్కువ సేపు వేడి గాలికి కూడా పాలు విరిగిపోవచ్చు

ముందుగా మీరు పాలు కొనేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చెక్ చేయండి. కొద్దిగా టైమ్ అంటేనే తీసుకోండి. పాలను ఎప్పుడూ ఫ్రీజింగ్ జోన్‌కి దగ్గర ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే పాడవ్వకుండా ఉంటాయి.

పాలను ఉపయోగించేటప్పుడు చాలా మంది చిన్న తప్పు చేస్తారు. పాలను తీసి వాడిన తర్వాత వాటిని బయటే ఉంచేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా పాలు విరిగిపోవచ్చు. కాబట్టి మీకు కావలసినన్ని తీసుకుని.. వెంటనే ఫ్రిజ్ పెట్టండి.




