మధుమేహంతో బాధపడేవారు తినడం, త్రాగడం విషయంలో పరిమితులు పాటించాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక క్యాలరీలు ఉండే చక్కెర ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్ కలిగిన ఆహారాలు కూడా అంత మంచిది కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.