- Telugu News Photo Gallery Diabetes patients can Soak onion in lemon juice and eat it to reduce Blood sugar
Diabetes home remedy: ఉల్లిపాయను ఇలా నానబెట్టి తింటే మధుమేహానికి దివ్యౌషధం..! బ్లడ్ షుగర్ కంట్రోల్
డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో ఆహారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా షుగర్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అందుకే మధుమేహం బాధితులు ఏది తినాలన్న ఆలోచించాల్సి ఉంటుంది. శాశ్వతంగా వదిలించుకోలేని షుగర్ వ్యాధిని, వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూనే.. శారీరక శ్రమ, కొన్ని కూరగాయలు తీసుకోవడం ద్వారా షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరంలాంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉల్లిపాయలు సులభమైన మార్గంగా సూచిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Sep 09, 2024 | 4:02 PM

ఇలా ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తినడం వల్ల.... మీరు ఊహించని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఉల్లిపాయను నిమ్మరసంలో నానబెట్టి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా అదుపులోకి వస్తాయి. ఉల్లిపాయ, నిమ్మరసం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

షుగర్ బాధితులు పచ్చి ఉల్లిపాయలు తరచూగా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ సలాడ్‌లో పచ్చి ఉల్లిపాయను తీసుకుని, అందులో నిమ్మరసం పిండుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ ఒక ప్రభావవంతమైన మార్గం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం,..నిమ్మరసంతో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని బెస్ట్ స్టార్టర్‌గా చెబుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయ సలాడ్, చట్నీ, వెజిటబుల్ గ్రేవీ వంటి ఏ రూపంలోనైనా తినవచ్చు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

ఉల్లిపాయల్లో క్రోమియం, సల్ఫర్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో పచ్చి ఉల్లిపాయలు సహకరిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ రసాన్ని తింటే షుగర్ లెవెల్ వెంటనే తగ్గుతుంది.




