Curry Leaves Tea: కరివేపాకు టీతో ఈ సమస్యలకు చెక్.. వెంటనే మీ డైట్ లో చేర్చుకోండి..
సాధారణంగా కరివేపాకును వంట రుచిని పెంచేందుకు వాడుతారు. కరివేపాకు లేనిదే భారతీయ వంటకాలు పూర్తికావు. కరివేపాకు కేవలం వంటకాల రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలో కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, కరివేపాకు ఉపయోగం గురించి మీరందరూ తప్పక తెలుసుకోవాలి. దీన్ని ఎక్కువగా దక్షిణ భారత ఆహారాన్ని టెంపర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా సాంబార్, దాల్ లేదా ఇడ్లీ తయారీలో ఉపయోగిస్తుంటారు.