- Telugu News Photo Gallery Curd in Monsoon: Why one should avoid consuming curd or yogurt during monsoon
Curd in Monsoon: వర్షాకాలంలో పుల్లని పెరుగు తింటున్నారా? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..
వేసవిలో రోజూ పుల్లటి పెరుగు తినాలి. అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. వేడి కొద్దిగా తగ్గుతోంది. కొన్ని సార్లు కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో పుల్లని పెరుగు తింటే మంచిదా? ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి.
Updated on: Jul 23, 2023 | 4:47 PM

పుల్లటి పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లని పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. పుల్లటి పెరుగు పేగు ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పుల్లని పెరుగు తినకూడదు. ఇది వాత, పిత్త, కఫ దశలను ప్రభావితం చేస్తుంది. ఇలా ప్రభావితం అయితే శరీర ఆరోగ్యం క్షీణిస్తుంది.

అంతేకాదు ఆయుర్వేదం ప్రకారం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక వర్షాకాలంలో పెరుగు తినడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం రావచ్చు.

వర్షాకాలంలో పుల్లని పెరుగు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంటే మీరు సులభంగా జబ్బు పడవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థితిలో పుల్లటి పెరుగు తింటే ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తవచ్చు.

చల్లగా ఉండే స్వభావంతో పుల్లటి పెరుగును ఎక్కువగా తింటే శరీరంలో అధిక శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మీరు వర్షాకాలంలో పుల్లటి పెరుగును తినాలనుకుంటే.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. చిటికెడు ఎర్ర మిరియాలు, వేయించిన జీలకర్ర , తేనెతో కలపండి. ఇలా తయారు చేసిన పెరుగు తినడం వల్ల ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు.





























