- Telugu News Photo Gallery Cricket photos Who is opening with rohit sharma teamindia have 4 options india pujara easwaran rahul vihari
IND vs ENG: రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరు..? టీమిండియాను వేధిస్తోన్న కొత్త సమస్య
India vs England 2021: ఈ పర్యటనలో టీమిండియాకు చెందిన ఇద్దరు ఓపెనర్లు గాయపడ్డారు. సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. అలాగే గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.
Updated on: Aug 03, 2021 | 1:17 PM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్టు 4, బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండవ సీజన్‌లో భాగంగా ఈ సిరీస్‌తో మొదలుకానుంది. సిరీస్ ప్రారంభాని ముందే భారత ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. నెట్స్ సెషన్‌లో భాగంగా మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. మొహమ్మద్ సిరాజ్ వదిలిన బౌన్సర్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో మైదానంలో మయాంక్ పడిపోయాడు. దీంతో తొలి టెస్టులో రోహిత్‌తోపాటు ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై కొత్త సమస్యలు వచ్చి్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రశ్నకు సమాధానంగా నలుగురు ఆటగాళ్లు టీమిండియాకు ఉన్నారు.

కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనర్ టీమిండియాకు ఉన్నాడు. రాహుల్ సరిగ్గా రెండేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడాడు. ఆగస్టు 2019 లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రాహుల్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత పునరాగమనం చేయలేకపోయాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో రాహుల్‌కు పిలుపొచ్చింది. ఇటీవల, డర్హామ్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో, రాహుల్ అద్భుత సెంచరీతో సత్తాచాటాడు. రాహుల్ తన కెరీర్‌లో ఓపెనర్‌గా 35 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1900 కంటే ఎక్కువ పరుగులు, 5 సెంచరీలు బాదేశాడు.

రాహుల్ కాకుండా, మరో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌గా జట్టులోకి వచ్చాడు. స్టాండ్‌బై ఓపెనర్‌గా జట్టుతో ఇంగ్లండ్ వచ్చాడు. బెంగాల్ రంజీ టీమ్ ప్లేయర్ ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్ గాయం తర్వాత ప్రధాన జట్టులో భాగం అయ్యాడు. ఇంతవరకు అంతర్జాతీయ అనుభవం లేని ఈశ్వరన్ వంటి కొత్త ఆటగాడితో సమరానికి వెళ్తుందా అంటే.. కొంచె కష్టమనే చెప్పవచ్చు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో గిల్‌కి అరంగేట్రం చేసేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈశ్వరన్‌పూ కూడా అలాంటి ఊహాగానాలే ఉన్నాయి. ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్‌లో మంది రికార్డులను కలిగి ఉన్నాడు. ఇందులో 64 మ్యాచ్‌లలో 13 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు, 43 సగటుతో 4401 పరుగులు సాధించాడు.

హనుమ విహారి కూడా మరో ఓపెనర్‌గా అందుబాటులో ఉన్నాడు. విహారి మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాట్స్‌మన్.. అవసరానికి అనుగుణంగా ఓపెనింగ్ చేసే బాధ్యతను కూడా సక్రమగా పోషించగలడు. 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన టెస్టులో విహారి ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. చాలాసేపు క్రీజులో ఉండిపోయాడు. ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్‌లో విహారికి చోటు దక్కడం కష్టం. కాగా, విహారి ఇంగ్లండ్‌లోనే 2018 పర్యటనలో అరంగేట్రం చేశాడు.

చివరగా ఛతేశ్వర్ పూజరాను పరిశీలించవచ్చు. భారత జట్టు మిడిల్-ఆర్డర్‌లో తనదైన ముద్ర వేయడంలో పుజరా దిట్ట. గతంలో అవసరమైన సందర్భాలలో జట్టు కోసం ఎంతగానో పోరాడిని సందర్భాలు ఉన్నాయి. ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఇందులో అతను 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో సహా 348 పరుగులు సాధించాడు. 112 పైగా సగటుతో పరుగులు సాధించాడు.




