- Telugu News Photo Gallery Cricket photos Up Warriorz buys Alyssa Healy In Wpl Auction 2023 For 70 Lakhs
WPL Auction 2023: అప్పుడు మిచెల్ స్టార్క్.. ఇప్పుడు అలిస్సా హీలీ.. డబ్ల్యూపీఎల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధం
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీగ్ వేలం జరిగింది. దేశ, విదేశాల్లోని స్టార్ క్రికెటర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అలిస్సా హీలీ కూడా ఉంది.
Updated on: Feb 15, 2023 | 1:45 PM

మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీగ్ వేలం జరిగింది. దేశ, విదేశాల్లోని స్టార్ క్రికెటర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అలిస్సా హీలీ కూడా ఉంది.

యూపీ వారియర్స్ ఈ ఔజీ కీపర్ బ్యాట్స్‌మెన్‌ని 70 లక్షల రూపాయలకు తీసుకుంది. హీలీ అనుభవం జట్టుకు ఒక అస్సెట్ కావచ్చు. హిల్లీ బేస్ ధర 50 లక్షల రూపాయలు. అయితే యూపీ వారియర్స్ 70 లక్షల రూపాయలు వెచ్చింది ఆమెను దక్కించుకుంది.

అలిస్సా హీలీ మరెవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య. స్టార్క్ కూడా గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

స్టార్క్ 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అయితే అలీసా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వారియర్స్ తరఫున ఆడనుంది.

32 ఏళ్ల హీలీ 2010 నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడుతోంది. ఇప్పటి వరకు 137 మ్యాచ్‌ల్లో 23.8 సగటుతో 2355 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ,13 అర్ధసెంచరీలు ఉన్నాయి.