- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma Breakes David Warners All Time Record
Rohit Sharma: వార్నర్ రికార్డును మడతెట్టేసిన హిట్‌మ్యాన్.. స్పెషల్ జాబితాలో చోటు
India vs Sri Lanka: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకట్టుకునే బ్యాటింగ్‌ను ప్రదర్శించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
Updated on: Aug 03, 2024 | 9:30 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఆకట్టుకునే హాఫ్ సెంచరీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డును లిఖించాడు. ముఖ్యంగా, ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టడం.

కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 47 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. ఈ 58 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15 వేల పరుగులు చేసిన 10వ బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మన్ నిలిచాడు.

ముఖ్యంగా ఓపెనర్‌గా వేగంగా 15 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే 2వ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది.

ఆస్ట్రేలియా తరపున వన్డే, టీ20, టెస్టుల్లో ఓపెనర్‌గా చెలరేగిన డేవిడ్ వార్నర్.. 15 వేల పరుగులు పూర్తి చేసేందుకు 361 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 15,000 పరుగులు చేసిన ప్రపంచంలో 2వ ఓపెనర్‌గా నిలిచాడు.

ఇప్పుడు రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ కేవలం 352 ఇన్నింగ్స్‌ల ద్వారా 15 వేల పరుగులు సాధించాడు. దీంతో వార్నర్ రికార్డును బద్దలు కొట్టి, అత్యంత వేగంగా 15,000 పరుగులు చేసిన ప్రపంచంలో 2వ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డే, టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున ఆడిన సచిన్ కేవలం 331 ఇన్నింగ్స్‌ల ద్వారా 15,000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 15,000 పరుగులు చేసిన ఓపెనర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.




