Venkata Chari |
Updated on: Oct 14, 2021 | 5:55 PM
Icc T20 World Cup
టీ 20 తుఫాను బ్యాట్స్‌మెన్‌ల విషయానికి వస్తే, క్రిస్ గేల్ పేరు తప్పకుండా వస్తుంది. ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ టీ 20 ప్రపంచ కప్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. టీ 20 వరల్డ్ కప్‌లో గేల్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 60 సిక్సర్లు కొట్టాడు. అతను 2007 నుంచి ప్రపంచ కప్‌లో ఆడుతున్నాడు. రెండుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నాడు.
గేల్ తర్వాత భారతదేశానికి చెందిన యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ టీ 20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడాడు. 33 సిక్సర్లు కొట్టాడు. 2016 లో యువరాజ్ తన చివరి ప్రపంచకప్ ఆడాడు.
ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ 20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఇంకా గెలవలేదు. కానీ, ఈ వాట్సన్ ఎన్నో సిక్సర్లు బాదేశాడు. టీ 20 ప్రపంచకప్‌లో వాట్సన్ మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి, 31 సిక్సర్లు కొట్టాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ ఆటగాడు టీ 20 ప్రపంచకప్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 30 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవని జట్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకటి.
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఐదో స్థానంలో ఉన్నాడు. స్వతహాగా ప్రశాంతత కలిగిన ప్లేయర్ మహేలా, టీ 20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడి, 25 సిక్సర్లు సాధించాడు.