రిటైర్మెంట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇప్పుడు, స్టోక్స్ వన్డే భవిష్యత్తు కొత్త కోచ్ మెకల్లమ్ చేతిలో ఉంది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో బెన్ స్టోక్స్‌తో కలిసి అపూర్వ విజయాలు సాధించిన బ్రెండన్ మెకల్లమ్, స్టార్ ఆల్ రౌండర్‌కు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో బెన్ స్టోక్స్ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.