- Telugu News Photo Gallery Cricket photos Shahid afridi fastest odi century with sachin bat against sri lanka on this day in cricket
వన్డేల్లో తొలి ఫాస్టెస్ట్ సెంచరీ.. సచిన్ బ్యాట్‌తో పాక్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
షాహిద్ అఫ్రిది తన హయంలో బ్యాట్‌తో చాలా రికార్డులు సృష్టించాడు. అయితే ఓసారి సచిన్ టెండూల్కర్ బ్యాట్‌తో ఒక స్పెషల్ రికార్డ్ చేశాడు.
Updated on: Oct 04, 2022 | 2:57 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తుఫాను బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రోజు అంటే అక్టోబర్ 4న కూడా ఈ పాక్ దిగ్గజం ఓ రికార్డు ఒకటి సృష్టించాడు. ఈ రికార్డ్ 1996లో వచ్చింది. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

అక్టోబరు 4, 1996న నైరోబీలో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆఫ్రిది 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ సమయంలో వన్డే క్రికెట్‌లో ఇది వేగవంతమైన సెంచరీ. ఈ మ్యాచ్‌లో ఆఫ్రిది 40 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 255గా నిలిచింది.

అఫ్రిది తన బ్యాట్‌తో ఈ ఫీట్ చేయలేదు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ బ్యాట్‌తో అతను ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్రిది చాలాసార్లు చెప్పుకొచ్చాడు. వకార్ యూనిస్ వద్ద సచిన్ బ్యాట్ ఉందని, అతను ఈ బ్యాట్‌ను అఫ్రిదికి ఇచ్చాడని, దాని నుంచే ఈ తుఫాను సెంచరీని సాధించాడు.

ఆ తర్వాత అనేక తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడిన ఆఫ్రిది పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. చాలా కాలం పాటు, అఫ్రిది వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు. ఆ తర్వాత 36 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ దానిని బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఈ రికార్డు 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు 289 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ అఫ్రిదిని తుఫాను బ్యాట్స్‌మెన్‌ల లెక్కలోకి తెచ్చింది.




