- Telugu News Photo Gallery Cricket photos Rishabh pant hit 36 sixes in three formats 2021 dethroned rohit sharma team india
రోహిత్ శర్మను పడగొట్టాడు.. టీమిండియాకు నయా ‘సిక్సర్ల కింగ్’గా అవతరించాడు.. ఎవరో తెలుసా?
టీమిండియాలో సిక్సర్ల రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది రోహిత్ శర్మ. ఇప్పుడు ఓ యువ ప్లేయర్ హిట్‌మ్యాన్‌ను పడగొట్టి నయా సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ ఏడాది అతడే అత్యధిక సిక్సర్లు బాదేశాడు. అతడెవరో తెలుసా.?
Updated on: Dec 25, 2021 | 3:26 PM

టీమిండియాలో సిక్సర్ల రారాజు అంటే ఠక్కున గుర్తొచ్చేది రోహిత్ శర్మ. ఇప్పుడు ఓ యువ ప్లేయర్ హిట్‌మ్యాన్‌ను పడగొట్టి నయా సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ ఏడాది అతడే అత్యధిక సిక్సర్లు బాదేశాడు. అతడు యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్.. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఎవరో కాదు రిషబ్ పంత్.

ఈ ఏడాది రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 36 సిక్సర్లు బాదాడు. ఇందులో 15 సిక్సర్లు టెస్టుల్లో కొట్టగా.. 11 వన్డేలు, 10 సిక్సర్లు టీ20లలో నమోదు చేశాడు.

రోహిత్ శర్మ ఈ ఏడాది 34 సిక్సర్లు మాత్రమే సాధించాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు(22) బాదిన రోహిత్ శర్మ.. టెస్టుల్లో 11 సిక్సర్లు, వన్డేల్లో ఒక్క సిక్స్ మాత్రం కొట్టాడు.

ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో పంత్, రోహిత్ ఉన్నారు. రోహిత్ శర్మ మొత్తం మూడు ఫార్మాట్లలో 35 ఇన్నింగ్స్‌లలో 1420 పరుగులు చేశాడు, అందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో, పంత్ 31 ఇన్నింగ్స్‌లలో 41.30 సగటుతో 1074 పరుగులు చేశాడు, ఇందులో 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.




