AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Highest Salary: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వేతనం వీళ్లదే.. టాప్ ప్లేస్ ఎవరిదో తెలిస్తే అవాక్కే..?

IPL Highest Salary Records: ఐపీఎల్ కేవలం క్రికెటర్లకు అపారమైన కీర్తిని మాత్రమే కాకుండా, గణనీయమైన ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది అనడానికి ఈ లెక్కలు నిదర్శనం. ముఖ్యంగా, భారత ఆటగాళ్లు తొలి నాలుగు స్థానాల్లో ఉండటం ఈ లీగ్‌లో దేశీయ సూపర్ స్టార్ల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

Venkata Chari
|

Updated on: Nov 18, 2025 | 11:14 AM

Share
Most Expensive IPL Cricketers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం ఆట మాత్రమే కాదు, క్రికెటర్లకు భారీగా జీతాలిచ్చే వేదిక. 2026 సీజన్ వరకు ఆటగాళ్లు అందుకున్న జీతాల (Salaries) ఆధారంగా అత్యధిక ఆదాయం పొందిన క్రికెటర్ల జాబితాను ఓసారి చూద్దాం. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాళ్లు, వారి ఆదాయ వివరాలు ఎలా ఉన్నాయంటే..

1 / 6
1. రోహిత్ శర్మ: రూ. 210.9 కోట్లు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ (MI) ఐదుసార్లు టైటిల్ గెలిచిన మాజీ సారథి రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. లీగ్‌లో ఆయన సుదీర్ఘ కాలం, నాయకత్వం, స్థిరమైన ప్రదర్శనతో ఇలాంటి భారీ జీతాన్ని అందుకున్నాడు.

2 / 6
2. విరాట్ కోహ్లి: రూ. 209.2 కోట్లు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి స్వల్ప తేడాతో రెండవ స్థానంలో ఉన్నాడు. లీగ్‌లో ఒకే ఫ్రాంచైజీకి అత్యంత ఎక్కువ కాలం ఆడిన ఆటగాళ్లలో ఆయన ఒకడిగా నిలిచాడు.

3 / 6
3. ఎం.ఎస్. ధోని: రూ. 192.84 కోట్లు: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి ఐదు IPL టైటిల్స్‌ను అందించిన 'కెప్టెన్ కూల్' ఎం.ఎస్. ధోని మూడవ స్థానంలో నిలిచాడు. అతని అపారమైన అనుభవం, నాయకత్వ సామర్థ్యం, ఆటపై ప్రభావం ఆయన వేతనాన్ని భారీగా పెంచేలా చేశాయి.

4 / 6
4. రవీంద్ర జడేజా: రూ. 139.01 కోట్లు: చెన్నై సూపర్ కింగ్స్ (CSK), భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగవ స్థానంలో నిలిచాడు. ఆయన ఆల్‌రౌండ్ నైపుణ్యాలు - బౌలింగ్, బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ - జట్టుకు ఆయన విలువను పెంచాయి.

5 / 6
5. సునీల్ నరైన్: రూ. 125.25 కోట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ఆదాయం పొందినవారిలో ఆయన ఒకరు కావడం విశేషం.

6 / 6