- Telugu News Photo Gallery Cricket photos Ravichandran ashwin wife prithi open up about their relationship love story on jio cinema
‘స్కూల్ డేస్ నుంచే నాపై క్రష్.. క్రికెట్ కోసమే కొన్నేళ్లు దూరం.. కట్‌చేస్తే.. షడన్‌గా స్టేడియంలోనే ప్రపోజ్’
Prithi Ashwin: క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ అందరికీ తెలుసు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. అశ్విన్ భార్య ప్రీతి తన ప్రేమ కథ గురించి కొన్ని కీలక విషయాలను పంచుకుంది.
Updated on: May 05, 2023 | 6:33 PM

రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ జట్టులో ప్రముఖ స్పిన్నర్‌గా మారాడు. మైదానంలో రికార్డులు లిఖించే అశ్విన్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్ 2023తో బిజీగా ఉన్నాడు.

అశ్విన్ క్రికెట్ ప్రపంచం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు అతని భార్య ప్రీతి అశ్విన్ తన ప్రేమ కథ గురించి కొన్ని కీలక విషయాలను పంచుకుంది.

జియో సినిమా హ్యాంగ్‌అవుట్ ప్రోగ్రామ్‌లో ప్రీతి అశ్విన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి మేం కలిసి పెరిగామని, ఒకే స్కూల్‌లో చదువుకున్నామని వెల్లడించింది.

మేం చిన్నప్పుడు ఒకే స్కూల్‌కి వెళ్లేవాళ్లం. పెళ్లికి ముందే మేం ఒకరికొకరం తెలుసు. స్కూల్ డేస్ నుంచి పెద్దవాళ్లయ్యే వరకు మేం కలిసి పెరిగాం' అని ప్రీతి అశ్విన్ పేర్కొంది.

అశ్విన్‌కి నాపై అభిమానం ఉంది. స్కూల్ మొత్తానికి ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో వేరే చోటికి వెళ్లాడు. అయినప్పటికీ, మేం ఒకరినొకరు పుట్టినరోజులు, కుటుంబ ఫంక్షన్లలో కలిసేవాళ్లం.

చాలా కాలం తర్వాత అశ్విన్ ఒకరోజు నన్ను కలిశాడు. అప్పుడు నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అకౌంటెంట్‌గా పని చేస్తున్నాను. అక్కడి నుంచి మా బంధం మరింత బలపడిందని అన్నారు.

ప్రీతీ కూడా అశ్విన్ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది. అశ్విన్ నన్ను నేరుగా క్రికెట్ గ్రౌండ్‌కి ఒకరోజు తీసుకెళ్లాడు. ఈ జీవితం ఉన్నంత కాలం నిన్ను ప్రేమించాలని ఉంది. పదేళ్లుగా తెలిసినా మా మధ్య ఎలాంటి మార్పు రాలేదని, ప్రపోజ్ చేశానని తెలిపింది.

అశ్విన్ ప్రపోజల్ కి ఓకే చెప్పిన ప్రీతీ 2011 నవంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి అఖిరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జియో సినిమాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఇంటర్వ్యూ చేయడానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, వేదా కృష్ణమూర్తి, డానిష్ షేత్ వచ్చారు.




