టెస్ట్ క్రికెట్: పాకిస్తాన్ అభిమానులు తమ క్రికెట్ జట్టుకు జూన్ 6వ తేదీని చెత్త రోజుగా భావిస్తుంటారు. అయితే తాజాగా ఆగస్ట్ 25 కూడా వచ్చి చేరింది. వన్డేలు, టీ20ల్లో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత టెస్టు క్రికెట్ వంతు వచ్చి చివరకు ఇక్కడ కూడా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రావల్పిండిలో వరుసగా 4 రోజులు అద్భుతమైన క్రికెట్ ఆడిన తర్వాత, 5వ రోజు ఆగస్టు 25న, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బంగ్లా కేవలం 30 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. తద్వారా ఈ ఫార్మాట్‌లో తొలిసారిగా పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ విజయం సాధించింది.