- Telugu News Photo Gallery Cricket photos ODI World Cup 2023 has set a new record with a total of 39 centuries so far 48 years of World Cup history
World Cup 2023: సెంచరీలతో దుమ్మురేపిన ఆటగాళ్లు.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో రికార్డులపై రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో ఎంతోమంది ఆటగాళ్లు తమ వ్యక్తిగత రికార్డులతో హోరెత్తించారు. ఇదే క్రమంలో విరాట్ కూడా వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసి, సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అయితే, 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డ్ చేరింది. అదేంటో ఇఫ్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 16, 2023 | 8:50 PM

ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డ్ బద్దలైంది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (39)లు నమోదయ్యాయి.

దీంతో వన్డే ప్రపంచకప్ 2023 మొత్తంగా ఇప్పటి వరకు 39 సెంచరీలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

తాజాగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ (101)సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

మిల్లర్ చేసిన ఈ సెంచరీ వన్డే ప్రపంచకప్ 2023లో 39వ సెంచరీగా నిలిచింది. అలాగే నాకౌట్‌లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.

ఈ 39 సెంచరీల్లో డికాక్ 4 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర తలో మూడు సెంచరీలు చేశారు.

మిచెల్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, డుసెన్, మార్ష్, మాక్సెవల్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ శర్మ, మార్క్రమ్, మలాన్, రాహుల్‌తో మరికొంత మంది ప్లేయర్లు తలో సెంచరీ చేశారు.




